Wednesday, 14 November 2018

నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల నామినేషన్

నిజామాబాదు వార్త:  నిజామాబాదు నగరంలోని నగర పాలక సంస్థ లో బుధవారం రోజు తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్త, బహుజన లెఫ్ట్  ఫ్రంట్ పార్టీ తరపున ఇస్మాయిల్, బీఎస్పీ పార్టీ తరపున మహతి రమేష్ లు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి  నామినేషన్స్ వేశారు.  ముందుగా బీఎస్పీ పార్టీ అభ్యర్థి మహతి రమేష్ మధ్యాహ్నం 12:50 గంటల ప్రాతంలో నామినేషన్ వేయడానికి వచ్చారు. ఆతర్వాత బహుజన లెఫ్ట్  ఫ్రంట్ పార్టీ అభ్యర్థి ఇస్మాయిల్, అటుతర్వాత తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్త లు విచ్చేసి మొదటి సెట్  నామినేషన్ను వేశారు. రేపు ఎంపీ   కల్వకుంట్ల కవిత తో కలిసి  రెండవ సెట్ నామినేషన్ వేయనున్నట్లు బిగాల గణేష్ గుప్త  పేర్కొన్నారు. అయితే నామినేషన్ వేసే సమయంలో బహుజన లెఫ్ట్  ఫ్రంట్ పార్టీ అభ్యర్థి ఇస్మాయిల్ కు తీవ్ర కడుపు నొప్పి  రావడంతో 108 వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

                                       
నామినేషన్ అనంతరం మాట్లాడుతున్న బిగాల 

ట్రాఫిక్ ను మళ్లించడంతో నిర్మానుష్యంగా  .. 
పోలీస్ బందోబస్తు 



బి ఫారం తో బీఎస్పీ పార్టీ అభ్యర్థి మహతి రమేష్ 


బి ఫారం తో బహుజన లెఫ్ట్ ఫ్రంట్  పార్టీ అభ్యర్థి ఇస్మాయిల్ 


బి ఫారం తో  తెరాస  పార్టీ అభ్యర్థి బిగాల గణేష్ గుప్త 



నామినేషన్ అనంతరం మాట్లాడుతున్న మహతి రమేష్ 

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి ఇస్మాయిల్ ను 108లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం 



No comments:

Post a Comment