Tuesday, 13 November 2018

తెరాస కే మళ్ళీ అధికారం : పోచారం

  • ప్రజల నుంచి అపూర్వ స్పందన 
  • ఎన్నికల ప్రచారంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ వార్త : ప్రజల ఆదరణ చూస్తుంటే ప్రభుత్వం పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో అర్థమౌతుంది, ఈ జన్మకు ఇది చాలనిపిస్తోందని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లి, రాణంపల్లి, సులేమాన్ ఫారం, రాయకూర్ తదితర గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల ప్రజలతో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందని, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట మాజీ amc చైర్మన్ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సంజీవ్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment