Friday, 9 November 2018

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలావత్ విఠల్


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలావత్ విఠల్ పోటీ చేస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామల రవీందర్ నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలావత్ విఠల్ కు సీటు కేటాయించారని,  ఈమేరకు ఆయన రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే పరమావధిగా పోటీలోకి ..:

NCP నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాలావత్ విఠల్

ప్రజా సంక్షేమమే పరమావధిగా పోటీలోకి దిగుతున్నానని, తెరాస పట్ల ప్రజలకున్న వ్యతిరేకత నన్ను గెలిపిస్తాయని NCP నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాలావత్ విఠల్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో యూత్ అధ్యక్షుడు అజయ్, అనిల్, మహిళా అధ్యక్షురాలు సీహెచ్.లక్ష్మి, విద్యార్ధి నాయకులు అశుతోష్ జాదవ్, సీనియర్ నాయకులు తిరుపతి, లింగం, అభిరాం, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment