Wednesday, 14 November 2018

ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు శిక్షణ

నిజామాబాదు వార్త : నిజామాబాద్  నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ ఆఫీసర్ లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి నిజామాబాదు కలెక్టర్ రామ్మోహన్ రావు, నిజామాబాదు ఆర్దీవోలు హాజరై అధికారులకు సూచనలు చేసారు. 
ఈ శిక్షణకు జిల్లా నుంచి సుమారు 100 మంది ప్రిసైడింగ్ అధికారులు హాజరై శిక్షణ పొందారు. శిక్షణలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ల పని విధానం, ఓటింగ్ మొదలు, ఓటింగ్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, ఈవీఎంల పనివిధానం, దివ్యంగులైన ఓటర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. 

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్న నిజామాబాద్ ఆర్డీఓ
                                        


శిక్షణకు హాజరైన ప్రిసైడింగ్ అధికారులు

No comments:

Post a Comment