Sunday, 11 November 2018

ఎన్టీఆర్, రాజమౌళి, రాంచరణ్ ల సినిమా ఘనంగా ప్రారంభం

ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆర్.ఆర్.ఆర్. (రామారావు, రాంచరణ్, రాజమౌళి)ల సినిమా ఆదివారం ఉదయం 11వ తేదీ, 11వ నెల, 11 గంటల 11 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి, హీరో ప్రభాస్, రానా, దర్శకులు వి వి వినాయక్, కొరటాల శివ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు  పాల్గొన్నారు.

దొంగగా ఎన్టీఆర్, పోలీస్ ఆఫీసర్ గా రాంచరణ్ 

అయితే 1920 సంవత్సరంలోని కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. ఈ కథలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్ గా రాంచరణ్, బ్రిటిష్ వాళ్ళను దోచుకొనే దొంగగా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య తెలిపారు. ఈ చిత్రానికి కథను బాహుబలి చిత్రానికి కథను అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు.


No comments:

Post a Comment