Monday, 26 November 2018

దేశం మొత్తంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చేది ఒక్క తెరాస ప్రభుత్వమే : కేసీఆర్

నిజామాబాదు వార్త:  దేశం మొత్తంలో రైతులకు ఉచితంగా 24 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చే ప్రభుత్వం ఒక్క తెరాస ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సోమవారం నిజామాబాదు జిల్లా డిచిపల్లిలో ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.  క్రిందటి ఎలెక్షన్లప్పుడు నిర్వహించిన సభకు ఇంతమంది రాలేదని, ఈసారి రెట్టింపు మంది కనిపిస్తున్నారని, దీన్ని బట్టి చూస్తే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సారి రెట్టింపు మెజారిటీతో గెలుస్తాడని ఆయన చమత్కరించారు. బాజిరెడ్డి గోవర్ధన్ మంచి పరిణతి, అనుభవం ఉన్న నాయకుడని, పోయినసారి మీరు ఆదరించి ఆయనను గెలిపించారని, ఈ సారి అత్యధిక  మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాల్లో 1 లక్ష 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నాదని అయన హామీ ఇచ్చారు. జక్రాన్పల్లిలో విమానాలు దిగేటటువంటి airstrip  ఏర్పాటు చేయిస్తానని, దేవుడు కరుణిస్తే మల్లీ వచ్చేటప్పుడు విమానంలనే వస్తానని అన్నారు. నిజామాబాద్ రురల్ నియోజకవర్గంలో 65,700 మందికి ఆసరా పింఛన్లు వస్తాయని, ఒక్క డిచిపల్లి లోనే 50 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని, 50 మంది గిరిజనులు సర్పంచులు కాబోతున్నారని,  తెలంగాణ వ్యాప్తంగా 3500 మంది గిరిజనులు సర్పంచులు కానున్నారన్నారు. గతంలో కరెంటు కష్టాలు  చాలా ఉండేవని, తెరాస ప్రభుత్వం వచ్చాక  ఆ కష్టాలన్నీ పోయాయన్నారు. చంద్రబాబు నాయుడుహైద్రాబాద్ను నేనే కట్టినా అంటడు .. మరి కూలీకుతుబ్షా ఎటుపోవాలని అని అయన చమత్కరించడంతో సభికులంతా ఒక్కసారిగా నవ్వారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే.. కరెంటు ఉండదన్నాడని, కానీ ఇవాళ ఆయన దగ్గరే ఆంధ్రప్రదేశ్ లోనే కరెంటు ఉంటలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నిజామాబాదు ఎంపీ కవిత, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, తెరాస నాయకులు కే.ఆర్. సురేష్ రెడ్డి, దినేష్ కుమార్, రాజేశ్వర్ రావు, గడీల రాములు తదితరులు పాల్గొన్నారు. 


ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న కేసీఆర్ 

బందోబస్తులో పోలీసులు సభకు హాజరైన అశేష జనవాహిని 
వేదికపై తెరాస నాయకులు 
No comments:

Post a Comment