Friday, 30 November 2018

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: "మీట్ ది ప్రెస్"లో ఆప్ పార్టీ అభ్యర్థి సిరాజుద్దీన్

నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన "meet the press" కార్యక్రమంలో aap party అభ్యర్థి 'సిరాజుద్దీన్ పాల్గొని నగర అభివృద్ధికి తమ పార్టీ ప్రణాళికల గురుంచి వివరించారు.

బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బాగుపడతారు : "meet the press"లో మహతి రమేష్

కార్యక్రమంలో మాట్లాడుతున్న BSP అభ్యర్థి మహతి రమేష్, పక్కన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవిదాస్ 

శుక్రవారం నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన "meet the press" కార్యక్రమంలో BSP అభ్యర్థి  'మహతి రమేష్ పాల్గొని తమ పార్టీ ప్రణాళికల గురుంచి, తనను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధిని  గురించి వివరించారు.

Thursday, 29 November 2018

చప్పగా సాగిన రాహుల్ గాంధీ సభ .. అనువాదంలో తడబడ్డ మధుయాష్కీ

నిజామాబాదు వార్త (ఆర్మూర్): ఎన్నికల వేళ అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విభిన్న  ప్రచారం, డబ్బు, మద్యం, కళాజాత ఇలా అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడుగా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి జాతీయ నాయకుల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాదు నగరంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే తెరాస పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టిన విషయం విదితమే. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే స్థానిక నాయకుల ఏర్పాట్ల మూలంగా సభ నిస్తారంగా సాగింది. ఇందుకు ముఖ్య కారణాలు.

- జిల్లా నాయకుల ప్రసంగంలోనే కాదు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడా  చప్పట్ల  చప్పుడు లేదు. ప్రజల నుంచి కనీస స్పందన లేదు.

-  రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అనువాదం చేసే ప్రక్రియను మధుయాష్కీ తీసుకొన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ... రాహుల్ గాంధీ బాగానే మాట్లాడారు కానీ ఆయన ఉద్వేగాన్ని మధుయాష్కీ తన అనువాదంలో చూపలేక పోయారు. దీనికి తోడు అనేక మార్లు అనువాదంలో తడబడ్డాడు. కొన్నిసార్లు తప్పుడుగా అనువాదించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పత్తి అని హిందీలో చెప్పినప్పుడు దాన్ని జొన్నలుగా పలికి మల్లీ సవరించుకొని పత్తి అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో "ఆసరా" పింఛన్ల గురుంచి ఏ ముసలి వాళ్ళను అడిగినా చెప్తారు. కానీ మన మాజీ ఎంపీ మధుయాష్కీ మాత్రం వాటిని "సహారా" పింఛన్లుగా అనువదించారు. అది విన్న జనాలు విస్తుపోయి "ఈయన రాష్ట్రంలో పథకాల పేర్లు కూడా మర్చిపోయినట్టున్నాడు"  అంటూ గుసగుసలాడుకొన్నారు.

-  ప్రజా కవి గద్దర్ కు జనాల్లో ఉన్న ఆదరణ గురుంచి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అలాంటి అయన "పొడుస్తున్న పొద్దు మీద" పాట అందుకొన్నారు. జనాలు మంచి ఊపు మీద ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ గాంధీ వస్తున్నారంటూ ఆయన పాటను ఆపించేశారు. ఇది కూడా జనాలకు తీవ్ర నిరాశ..  కోపం తెప్పించాయి.

స్క్రిప్ట్ రైటర్ "షబ్బీర్ అలీ".. డబ్బింగ్ ఆర్టిస్ట్ "రాహుల్ గాంధీ"..!?

టైటిల్ చూసి ఇదేంటబ్బా... షబ్బీర్ అలీ స్క్రిప్ట్ రాయడం ఏంటి..? రాహుల్ గాంధీ డబ్బింగ్ చెప్పడం ఏంటి..? అని ఆలోచనలో పడ్డారా..? అవునండీ  మీరు చదివింది నిజమే.. అయితే ఇదేదో సినిమాకోసం మాత్రం కాదండోయ్.. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. 
గురువారం ఆర్మూర్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ వచ్చారు. సభా వేదికపై ఆసీనులై ఉన్నారు.  మరో పక్క ఉత్తమకుమార్ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ షబ్బీర్ అలీ ఒకరినొకరు మాట్లాడుకోవడం .. షబ్బీర్ రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో వివరించడం.. దాన్ని రాహుల్ గాంధీ ఒక లెటర్ ప్యాడ్ పై నోట్ చేసుకోవడం నిజామాబాదు వార్త పరిశీలించి ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించింది. 

- వెంకట్ చింతకింది, నిజామాబాదు వార్త ప్రతినిధి 


రాహుల్ గాంధీ సభలో గద్దర్ కు అవమానం..!? జీర్ణించుకోలేకపోయిన గద్దర్ అభిమానులు

నిజామాబాదు వార్త : నిజామాబాదు జిల్లా ఆర్మూరులో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ శ్రేణుల ప్రవర్తనతో  ప్రజా కవి గద్దర్ కు అవమానం జరిగింది. దీని వల్ల గద్దర్ బాదపడ్డారో లేదో తెలియదు కానీ .. గద్దర్ అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు. గద్దర్ ";పొడుస్తున్న పొద్దుమీద" పాట పాడుతుండగా మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చి రాహుల్ గాంధీ రాబోతున్నారని చెప్పి పాటను ఆపించేసారు. దీంతో గద్దర్ పాటను వినే అదృష్టం తమకు లేకపోయిందని అభిమానులు బాధపడ్డారు.

ఆర్మూరులో రాహుల్ గాంధీ సభ ఫొటోస్ | rahul gandhi public meeting in armoor photos |

ఆర్మూరులో బహిరంగసభకు హాజరైన ప్రజలు


ఆర్మూర్ బహిరంగసభలో మాట్లాడుతున్న మండవ వెంకటేశ్వర రావు 

వేదికపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న అన్నపూర్ణమ్మ 

సభలో చిందు కళాకారులు 

సభలో పాట పాడుతున్న గద్దర్ 


సభలో మాట్లాడుతున్న ఆకుల లలిత 
సభలో మాట్లాడుతున్న మధుయాష్కీ 


సభలో సెల్ఫోన్లో నిమగ్నమైన రాహుల్ గాంధీ 

సభలో మాట్లాడుతున్న ఉత్తమకుమార్ రెడ్డి 

ప్రజలకు నమస్కరిస్తున్న నిజామాబాదు, కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థులు 

సభలో షబ్బీర్ అలీతో రాహుల్ మంతనాలు 

మాట్లాడుతున్న ప్రజాకవి గద్దర్ రాహుల్ గాంధీకి జ్ఞాపికను అందజేస్తున్న కాంగ్రెస్ జిల్లా నాయకులు 

Wednesday, 28 November 2018

ఒక్కసారి అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేసి చూపిస్తా : మీట్ ది ప్రెస్ లో తాహెర్

నిజామాబాదు వార్త: ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, ఒక్కసారి అవకాశం ఇస్తే నిజామాబాదు నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆయన  నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో పాల్గొని తన అనుభవాలను పాత్రికేయులతో పంచుకొన్నారు.
సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించి ప్రజల ఆదరాభిమానాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. తన రాజకీయ జీవితం,  పార్టీ కోసం కృషి, కార్మిక సంఘాల నాయకుడిగా తదితర అనేక విషయాలపై ఓపికగా మాట్లాడారు. అధికార తెరాస పార్టీ లోపాలను ఎండగట్టారు. అభివృద్ధి చేయకున్నా చేశామంటూ పొంతనలేని సమాదానాలు చెప్తున్నారని తెరాస వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను కూడా తెలిసి, తెలియక తప్పులు చేసి ఉండవచ్చునని, అయితే నావల్ల తప్పు జరిగితే తప్పకుండా నా తప్పును ఒప్పుకొంటానని అన్నారు. ఎవ్వరిని అడిగినా తాహెర్ మంచివాడని అంటారని, చేయి గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేవ చేసుకొంటానని ఆయన హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవిదాస్, ప్రధాన కార్యదర్శి నరేందర్ లు జర్నలిస్టులకు రెండు పడకల ఇల్లు, ఉచిత కంటి పరీక్షలు, జర్నలిస్ట్ పిల్లలకు కేజీ నుంచి పీజీ ఉచిత విద్య తదితర విషయాలపై  తాహెర్ కు మెమోరాండం సమర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు పుష్పగుచ్ఛముతో తెహెర్ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

తాహెర్ కు పుష్పగుచ్ఛము అందజేస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు  దేవిదాస్, నరేందర్ 

కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాదు అర్బన్ అభ్యర్థి తాహెర్ 


Tuesday, 27 November 2018

అత్యంత పేద రాష్ట్రాలతో తెలంగాణను పోల్చడం బాధాకరం : ఎంపీ కవిత

నిజామాబాద్‌ వార్త : ప్రధాని మోది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపి కవిత మండిపడ్డారు. నిజామాబాద్‌లో అసలు అభివృద్ధే లేదని , అత్యంత పేద రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదని మోది అనడం బాధాకరమని కవిత అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాలుగేళ్లలో నిజామాబాద్‌ ఎంతో అభివృద్ది చెందిందని చెప్పారు. అక్కడ ఉండు పేదవారికి ప్రతినెలా 28 వేల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, అండర్‌గ్రౌండ్‌ పనులు దాదాపు పూర్తి అయ్యాయని కవిత చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రోడ్లు తవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ఎంతో ఓపికగా ఉండి సహకరిస్తున్న నిజామాబాద్‌ ప్రజలకు నా ధన్యవాదాలు. నిజామాబాద్‌ ప్రజలకు ఉన్న ఓపిక కూడా ప్రధాని మోదికి లేదని ఎంపి కవిత ఎద్దేవా చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాదు ఎంపీ  కవిత