Tuesday, 23 October 2018

స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడుతున్నారా..? అయితే ఇది తప్పక చదవండి..?


ఇప్పుడు ఎవ్వరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ లే.. స్కూల్ పిల్లాడి నుంచి మొదలు వృద్ధుల వరకు అందరి చేతుల్లో అవే .. ఇక యువత గురుంచి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భోజనం లేకుండా ఉండగలరేమోగాని మొబైల్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితికి దిగజారారు. ఒక అవసరంగా   మన జీవితాల్లోకి ప్రవేశించిన ఈ ఫోన్లు తర్వాత జీవితంలో ఓ భాగమైపోయాయి. రోజురోజుకి వీటి వాడకం పెరిగిపోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒక మహిళ smart phone తో కష్టాలు కొనితెచ్చుకొంది. smart phone కు బానిసై చేతివేళ్ళు కదిలించలేని స్థితికి చేరుకొంది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఒక మహిళ smartphone కు బానిసై వారం రోజులపాటు ఏకధాటిగా మొబైల్ వినియోగించింది. రాత్రికి మాత్రం కాస్త విరామం ఇచ్చింది. ఇలా రోజూ అదేపనిగా వాడడం వల్ల ఈమె చేతులు వంగిపోయి బిగుసుకుపోయాయి. కొన్ని వేళ్ళు అయితే వంకర తిరిగిపోయాయి. దీంతో బాధితురాలు వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందింది. ఆతర్వాత ఫిజియోథెరపి తో ఆమె చేతివేళ్ళను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. 

No comments:

Post a Comment