Saturday, 20 October 2018

నిజామాబాదు లో కనీవినీ ఎరుగనిరీతిలో అంగరంగ వైభవంగా దుర్గామాత శోభాయాత్ర




  • ఆకట్టుకున్న కోటగల్లి దుర్గామాత శోభాయాత్ర
  • చూడ్డానికి రెండు కనులు చాలావన్నంత అద్భుతమైన ప్రదర్శనలు 
  • నగరవాసులు డాన్సులతో ఉబ్బితబ్బుబ్బి మైమరిచారు 
  • కళాకారులతో సెల్ఫీలు 
  • ట్రాఫిక్ పర్యవేక్షించిన పోలీసులు 
  • ప్రశాంతంగా దుర్గామాత శోభాయాత్ర.. నిమజ్జనం.


నిజామాబాద్ వార్త.కామ్ :  ఇందూరులో నవరాత్రి ఉత్సవాలు ఎంత బాగా జరిగాయో అంతకు 100 రెట్లు ఘనంగా నిమజ్జన శోభాయాత్ర జరిగింది. చూడ్డానికి రెండు కనులు చాలవన్నంతలా కళాకారుల ప్రదర్శనలు.. యువత నృత్యాలు ఆకట్టుకొన్నాయి...అబ్బురపరిచాయి.. తన్మయత్వానికి  గురిచేశాయి. ఎనలేని సంతోషాన్ని నగర ప్రజలకు అందించాయి.  ముఖ్యంగా కోటగల్లి లోని దుర్గామాత కళాకారుల బృందం ప్రదర్శన గురుంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాంప్రదాయ..శాస్త్రీయ నృత్యం, డప్పు కళాకారుల ప్రదర్శన, మరాఠి భజన, చిరుత భజన, కర్రసాము, నిప్పుతో ప్రత్యేక ప్రదర్శనలు, మహిళల డప్పు నృత్యం, పులి, ఎలుగుబంటు తదితర ప్రత్యేక వేషధారణలతో కూడిన నృత్యాలు, యువతీయువకుల డీజే నృత్యాలతో నగరం దద్దరిల్లింది. ఇందూరు కళను ప్రపంచానికి చాటిచెప్పాయి.  పులి ఎలుగు బంటి వేషం ధరించిన కళాకారులతో కొందరు సెల్ఫీలు దిగారు.  అడుగడుగున పొలుసులు బందోబస్తును సమీక్షించారు. మొత్తంగా 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో విశేష పూజలు నిర్వహించిన ఇందూరు భక్తులు  దుర్గామాత శోభాయాత్రలో పాల్గొని ఎనలేని సంతోషాన్ని..చిరస్మరణీయమైన .. మధురమైన అనుభూతిని పొందారు.  శోభాయాత్రను స్వయంగా చూడలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే "నిజామాబాద్ వార్త" శోభాయాత్ర వీడియోలను చిత్రీకరించి మా పాఠకులకు అందజేయడం జరుగుతుంది. చూసి ఆనందించండి.



No comments:

Post a Comment