Thursday, 20 September 2018

ఓటరు నమోదు అందరి బాధ్యత


కామారెడ్డి: ప్రజాస్వామ్యంలో ఓటరు నమోదు అందరి బాధ్యతని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఈఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా ఓటరుగా చేరాలన్నారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా ప్రోత్సహించాలన్నారు. మహిళలు, యువత, దివ్యాంగులు శతశాతం ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. సహాయ పాలనాధికారి వెంకటేష్‌ దాత్రే మాట్లాడుతూ..యువత సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని విస్తృతంగా ఓటరు నమోదుపై చైతన్యం తీసుకు రావాలన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment