Thursday, 20 September 2018

చక్కెర కార్మికులకు వేతనాల చెల్లింపునకు అంగీకారం


బోధన్‌: నిజాం చక్కెర కార్మికులకు జీతం బకాయిలు చెల్లించడానికి ఎంపీ కవిత ఆమోదం తెలిపారని తెరాస మైనారిటీ నాయకులు రజాక్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆమెను కార్మికులతో వెళ్లి కలిశామన్నారు. లేఆఫ్‌ కారణంగా జీతాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంపీ ఫోన్‌లో మాట్లాడి బకాయి వేతనాల చెల్లింపునకు అంగీకరించారన్నారు. శక్కర్‌నగర్‌, మెదక్‌, మెట్‌పల్లి యూనిట్ల పరిధిలో మొత్తం 265 మంది కార్మికులు ఉన్నట్టు గుర్తించారని, మార్చి 2018 వరకు 27 నెలల జీతాలు వారికి అందించనున్నారన్నారు. ఈ మేరకు రూ.14.65 కోట్లను ఇప్పించడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.

No comments:

Post a Comment