Monday, 17 September 2018

ఇవే నా చివరి ఎన్నికలు : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి



బోధన్: రాబోయే ఎన్నికలే తను చివరివని, తరువాత రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు కాంగ్రెస్‌ నాయకుడు, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాలూరక్యాంపు, సాలంపాడ్, పెంటాఖుర్దు, చెక్కిక్యాంపులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే యువకుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టానని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని, ఇందుకు సంబంధించిన శాస్త్రీయ గణాంకాలు తనవద్ద ఉన్నాయన్నారు. నిజాంసాగర్‌ నీటిని బాన్సువాడ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా బోధన్‌ వరకు అందేలా చూడాలన్నారు. సాలూరలో మంజీర నదిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామన్న తెరాస సర్కారు మాట నిలబెట్టుకోలేదన్నారు. తాను మంత్రిగా పని చేసిన సమయంలో సాగునీటి కాలువలను సీసీలుగా మార్చగా, తర్వాతి పాలకులు వాటికి షట్టర్లు బిగించలేదన్నారు. సాలూరక్యాంపులో సుదర్శన్‌రెడ్డిని ఆహ్వానించిన కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన్ను ఎడ్లబండిపై ఊరేగించారు. బండికి కాంగ్రెస్, తెదేపా జెండాలు కట్టడం చర్చనీయాంశమైంది. ఎంపీపీ గంగాశంకర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, సీడీసీ మాజీ ఛైర్మన్‌ పోతారెడ్డి, నాగేశ్వర్‌రావు, సైదుల్‌రెడ్డి, సాయిలు, అశోక్, శ్రీనివాస్, ఖలీలుద్దిన్‌ తదితరులున్నారు.

No comments:

Post a Comment