Thursday, 20 September 2018

వేగంగా సుందరీకరణ పనులు: ఎంపీ కవిత



నిజామాబాద్‌ అర్బన్‌: తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ నుంచి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ కవిత పాల్గొని జెండా ఊపి ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేశ్‌ గుప్తా మాట్లాడుతూ.. 60 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చేయనేని అభివృద్ధిని కేవలం నాలుగున్నర ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం మొత్తానికి కేటాయించే నిధులు ఒక్క సంవత్సరంలో కేవలం ఒక్క జిల్లా కేంద్రానికే రూ.850 కోట్లు కేటాయించామన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలో భారీగా వాహనాలు పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటే రైల్వే కమాన్‌ వద్ద రెండవ మార్గం ఏర్పాటు చేసే ఆలోచన గత పాలకులకు రాలేదన్నారు. తెరాస అధికారంలోకి రాగానే రైల్వే కమాన్‌ వద్ద కొత్తగా మరో మార్గం పనులు ప్రారంభించామన్నారు. మరో నెల రోజుల్లో జిల్లా కేంద్రంలో ప్రతి రోడ్డు కొత్తగా మారుతుందన్నారు. ఇక సుందరీకరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయన్నారు.

తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

వినాయక్‌నగర్‌ నుంచి గణేశ్‌గుప్తా ప్రారంభించిన పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ పాదయాత్ర ప్రారంభించాక ఎంపీ ముందుకు కదలగా ఆమెతో పాటు మేయర్‌ సుజాత, ఇతర కార్పొరేటర్లు, అనుచరులు పాదయాత్రలో పాల్గొని ముందుకు కదిలారు. పుల్లాంగ్‌, హైదరాబాద్‌ రోడ్డు, కలెక్టర్‌ మైదానం, బస్టాండు రోడ్డు, గాంధీచౌక్‌, నెహ్రూపార్క్‌, బోధన్‌ బస్టాండు వరకు కొనసాగింది. బ్యాండు, డప్పులతో ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో కాలనీవాసులు, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పూలదండలు వేసి సన్మానించారు.

No comments:

Post a Comment