Thursday, 20 September 2018

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ఆర్మూర్‌: 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఆర్మూర్‌ పట్టణ శివారులోని సిద్ధులగుట్ట సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ శివారులోని సుభాష్‌నగర్‌కు చెందిన యోగేశ్‌(19), సునీల్‌(20) అనే యువకులు ద్విచక్ర వాహనంపై ఆర్మూర్‌కు వెళ్తున్నారు. అదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. తమ కాలనీలో ప్రతిష్ఠించిన గణపతి మండపం వద్ద అన్నదానం నిర్వహించటం కోసం అవసరమైన సరకులను తీసురావటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment