Thursday, 20 September 2018

జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక


తెలంగాణ జట్టు కెప్టెన్‌గా బామన్‌ నమ్రత

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జాతీయస్థాయి సీనియర్స్‌ మహిళల పుట్‌బాల్‌ టోర్నీకి ఇందూరు ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులు బామన్‌ నమ్రత, బి.మేఘన, మనీష ఎంపికయ్యారని నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ బుధవారం తెలిపారు. అంతేకాక బామన్‌ నమ్రతకు తెలంగాణ రాష్ట్ర మహిళల పుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా అవకాశం దక్కిందన్నారు. జాతీయ పోటీలు కటక్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి మొదలయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర జట్టు మ్యాచ్‌లు ఈ నెల 20వ తేదీ నుంచి మొదలవుతున్నాయని పేర్కొన్నారు. ఇందూరు నుంచి నమ్రత, మేఘన, మనీషాలకు ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment