Monday, 17 September 2018

Amit Tiwari: కౌశల్ కన్నింగ్.. బ్యాగ్ సర్దేసిన అమిత్ ‘బిగ్ బాంబ్’




దీప్తి నల్లమోతు సుదీర్ఘ ప్రసంగానికి హడలెత్తిపోయిన బిగ్ బాస్ హౌస్.. నాని పరుగులు.. కంటెస్టెంట్స్ నిద్రలోకి.. ఎలిమినేట్ అయిన అమిత్.. కౌశల్‌పై తీవ్ర వ్యాఖ్యలు.. ఆ ముగ్గురే టాప్ 3.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు నేటి ఎపిసోడ్‌లో..

బిగ్ బాస్ హౌస్‌లో వీకెండ్ వస్తే.. శనివారం నాడు హాట్ హాట్ డిస్కషన్స్‌లో రంజుగా సాగుతుంది. నాని హోస్ట్‌గా హెడ్ మాస్టర్ అవతారంలో ఒక్కో కంటెస్టెంట్‌‌కి మొట్టికాయలేస్తున్న నాని ఆదివారం నాటి 99వ ఎపిసోడ్‌లో ‘నీ మంచికోరి’ అనే సరదా సరదా టాస్క్‌లో ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఈ టాస్క్‌లో భాగంగా తమ తోటి కంటెస్టెంట్‌లో ఉన్న ఏదైతే నెగిటివ్ క్వాలిటీ ఉందో దాన్ని తొలిగించుకుంటే బావుంటుందని భావిస్తారో అలాంటి నెగిటివ్ పదాలు ఆరింటిని సూచించాలని.. ఆ సందర్భంలో కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు నాని.

ఈ గేమ్‌లో భాగంగా.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద, కన్నింగ్, స్వార్థం, అత్యాశ, మాట మీద నిలబడక పోవడం, అహం, రెచ్చగొట్టడం లాంటి పదాల్ని సూచించారు.

ఇక కౌశల్ కళ్లకు గంతలు కట్టి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని.. వాటిని తొలిగించుకుంటే మంచిదంటూ వీటిని సూచించారు. కౌశల్‌కి గురించి ఎవరు ఏమన్నారంటే..


కౌశల్ కన్నింగ్... తనీష్.

కౌశల్‌కి స్వార్ధం.. రోల్ రైడా

కౌశల్‌కి అత్యాశ.. దీప్తి నల్లమోతు

కౌశల్‌ మాట మీద నిలబడడు.. సామ్రాట్

కౌశల్ రెచ్చగొడతాడు.. అమిత్

కౌశల్‌కి అహం ఎక్కువ.. గీతా మాధురి


ఇక గీతా మాధురి గురించి.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద లాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీప్తి నల్లమోతు గురించి ఫేక్‌గా ఆడటం, నస, అత్యుత్సాహం లాంటి నెగిటివ్ కామెంట్స్ రాగా.. ఈ ‘నీ మంచికోరి’ టాస్క్‌లో దీప్తి నల్లమోతు అడిషనల్ షీట్ ప్రసంగాన్ని నానితో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తూనే ఆట పట్టించారు. ఆమె మొదలు పెడితే అసలు ఆపకుండా చేసిన సుదీర్ఘమైన ప్రసంగాలకు హౌస్ మేట్స్ పారిపోయారు. ఇది చాలా సరదాగా సాగింది.

ఈవారం ఎలిమినేషన్‌లో అమిత్ ఔట్..

ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, గీతా, కౌశల్, అమిత్, కౌశల్‌లలో తొలిత సేఫ్ అయ్యింది దీప్తి నల్లమోతు అని కాస్త రిలీఫ్ ఇచ్చారు నాని. ఇక మిగిలిన నలుగురిలో రెండో హౌస్ మేట్‌గా కౌశల్‌ని సేఫ్ చేశారు. మూడో హౌస్ మేట్‌గా గీతా.. నాలుగో హౌస్‌మేట్‌గా రోల్ రైడా సేఫ్ కావడంతో.. మిగిలిన అమిత్ ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి బ్యాగ్ సర్దేశాడు.

టాప్ 3 వీళ్లే.. టైటిల్ వాళ్లు కొడితే హ్యాపీ..


తన దృష్టిలో గీతా మాధురికి మంచి సెన్స్ ఉందని.. చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతుందని, సామ్రాట్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారు. ఇక ఉన్నవారిలో టాప్ 3 ఎవరనే విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురిలు టాప్ 3 అన్నారు. బిగ్ బాస్ టైటిల్ రోల్ రైడా, సామ్రాట్‌‌లు గెలిస్తే బావుంటుందన్నారు. ఇక కౌశల్‌ ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తాడన్నారు. ఆయనలో కన్నింగ్ లక్షణాలు ఉన్నాయన్నారు.

బిగ్ బాంబ్ ఆమెపైనా..

ఇక ఎలిమినేట్ కంటెస్టెంట్‌కి సాంప్రదాయంగా వస్తున్ బిగ్ బాంబ్‌ను దీప్తి నల్లమోతుపై విసిరారు అమిత్. దీని ప్రకారం హౌస్‌లో వారం రోజుల పాటు.. కంటెస్టెంట్స్ అందరి జట్టును దీప్తి మాత్రమే దువ్వాలి.

No comments:

Post a Comment