Saturday, 29 September 2018

Nee Paata Madhuram , Kannulada Cover Song || Sudha Ganti || Shanmukh Tallapragada

"సరదాగా ... కాసేపు" మూవీ లోని "నీ పాత మధురం" అనే అద్భుతమైన సాంగ్ పై "sudha" అండ్ "shanmukh" superb expressions తో చాల బాగా act చేసారు... have a  look ...

Pillaa Raa Full Video Song Cover | RX 100 Songs | Karthikeya | Payal Rajput | #RX100 | Telugu Cinema

rx 100 మూవీ లోని "పిల్ల రా..." సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలిసిందే..!
అయితే ఈ సాంగ్ పై  "Tinku Prem Patel and Kavita Mahatho" అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూసి ఎంజాయ్ చేయండి.. ముఖ్యంగా "కవిత" చాల బ్యూటిఫుల్ గ ఉంది..


Friday, 28 September 2018

Inkem Inkem Full Video Song (Edited Version) || Geetha Govindam Songs || Vijay Devarakonda, Rashmika

Geetha Govindam  మూవీ లోని "inkem inkme kavale " సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలిసిందే..!
అయితే ఈ సాంగ్ పై  "Kiran kathare" అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూసి ఎంజాయ్ చేయండి..

Inkem Inkem Inkem Kavale Cover Ram Gopal ft.

Geetha Govindam  మూవీ లోని "inkem inkme kavale " సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలిసిందే..!
అయితే ఈ సాంగ్ పై  "ramgopal" అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూసి ఎంజాయ్ చేయండి..

Rx100 Pilla Raa Full Video Song | 4K Cover | Kartikeya Payal Rajputh | Chary CR | Anusha

rx 100 మూవీ లోని "పిల్ల రా..." సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలిసిందే..!
అయితే ఈ సాంగ్ పై  "Chary CR & Anusha " అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూసి ఎంజాయ్ చేయండి..


RX100 Pilla Raa Song Dance cover By Shanmukh Jaswanth

rx 100 మూవీ లోని "పిల్ల రా..." సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలిసిందే..!
అయితే ఈ సాంగ్ పై షణ్ముఖ్ జశ్వంత్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూసి ఎంజాయ్ చేయండి..

Thursday, 20 September 2018

100 Rupees Makeup Challenge || In Telugu

ప్రతి ఒక్కరు ఇంట్లోనే కేవలం రూ.100 తో proffessional లుక్ వచ్చేలా ఎలా మేకప్ వేసుకోవాలో దివ్య గారు చాలా చక్కగా చూపించారు.. ఆ వీడియో మీకోసం..


Party Makeup for Oily Skin in Telugu || Divya Vlogz in Telugu

ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆయిల్ చర్మం ఉన్నవారు పార్టీ మేకప్ ఎలా వేసుకోవాలో మన దివ్య గారు చాల చక్కగా వెరీ సింపుల్ గ, ఎలా మేకప్ వేసుకోవాలో వివరించారు. ఆ వీడియో మీకోసం... చూసి మీరూ ట్రై చేయండి.. best of luck ...

Menstrual Cup || How to use? || All about Menstrual Cup || Everteen Menstrual Cup?

ladies periods (month) అయినప్పుడు  menstrual cup ని ఎలా ఉపయోగించాలి...? sanitary pads వాడకుండా ఎందుకు menstrual cup నే వాడాలి? Menstrual cup వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి? sanitari pads వాడడంలో ఉన్న రిస్క్ ఏంటి? అనేది దివ్య గారు చాల చక్కగా వివరించారు. ఆ వీడియో మీకోసం...


పొడిచర్మం ఉన్నవారికి party మేకప్ : Party Makeup for Dry Skin in Telugu

ఫ్రెండ్స్ ఈ వీడియోలో పొడిచర్మం ఉన్నవారు పార్టీ మేకప్ ఎలా వేసుకోవాలో మన దివ్య గారు చాల చక్కగా వెరీ సింపుల్ గ, ఎలా మేకప్ వేసుకోవాలో వివరించారు. ఆ వీడియో మీకోసం... చూసి మీరూ ట్రై చేయండి.. best of luck ...


ఓటరు నమోదు అందరి బాధ్యత


కామారెడ్డి: ప్రజాస్వామ్యంలో ఓటరు నమోదు అందరి బాధ్యతని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఈఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా ఓటరుగా చేరాలన్నారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా ప్రోత్సహించాలన్నారు. మహిళలు, యువత, దివ్యాంగులు శతశాతం ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. సహాయ పాలనాధికారి వెంకటేష్‌ దాత్రే మాట్లాడుతూ..యువత సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని విస్తృతంగా ఓటరు నమోదుపై చైతన్యం తీసుకు రావాలన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వేగంగా సుందరీకరణ పనులు: ఎంపీ కవిత



నిజామాబాద్‌ అర్బన్‌: తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ నుంచి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ కవిత పాల్గొని జెండా ఊపి ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేశ్‌ గుప్తా మాట్లాడుతూ.. 60 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చేయనేని అభివృద్ధిని కేవలం నాలుగున్నర ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం మొత్తానికి కేటాయించే నిధులు ఒక్క సంవత్సరంలో కేవలం ఒక్క జిల్లా కేంద్రానికే రూ.850 కోట్లు కేటాయించామన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలో భారీగా వాహనాలు పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటే రైల్వే కమాన్‌ వద్ద రెండవ మార్గం ఏర్పాటు చేసే ఆలోచన గత పాలకులకు రాలేదన్నారు. తెరాస అధికారంలోకి రాగానే రైల్వే కమాన్‌ వద్ద కొత్తగా మరో మార్గం పనులు ప్రారంభించామన్నారు. మరో నెల రోజుల్లో జిల్లా కేంద్రంలో ప్రతి రోడ్డు కొత్తగా మారుతుందన్నారు. ఇక సుందరీకరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయన్నారు.

తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

వినాయక్‌నగర్‌ నుంచి గణేశ్‌గుప్తా ప్రారంభించిన పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ పాదయాత్ర ప్రారంభించాక ఎంపీ ముందుకు కదలగా ఆమెతో పాటు మేయర్‌ సుజాత, ఇతర కార్పొరేటర్లు, అనుచరులు పాదయాత్రలో పాల్గొని ముందుకు కదిలారు. పుల్లాంగ్‌, హైదరాబాద్‌ రోడ్డు, కలెక్టర్‌ మైదానం, బస్టాండు రోడ్డు, గాంధీచౌక్‌, నెహ్రూపార్క్‌, బోధన్‌ బస్టాండు వరకు కొనసాగింది. బ్యాండు, డప్పులతో ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో కాలనీవాసులు, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పూలదండలు వేసి సన్మానించారు.

జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక


తెలంగాణ జట్టు కెప్టెన్‌గా బామన్‌ నమ్రత

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జాతీయస్థాయి సీనియర్స్‌ మహిళల పుట్‌బాల్‌ టోర్నీకి ఇందూరు ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులు బామన్‌ నమ్రత, బి.మేఘన, మనీష ఎంపికయ్యారని నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ బుధవారం తెలిపారు. అంతేకాక బామన్‌ నమ్రతకు తెలంగాణ రాష్ట్ర మహిళల పుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా అవకాశం దక్కిందన్నారు. జాతీయ పోటీలు కటక్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి మొదలయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర జట్టు మ్యాచ్‌లు ఈ నెల 20వ తేదీ నుంచి మొదలవుతున్నాయని పేర్కొన్నారు. ఇందూరు నుంచి నమ్రత, మేఘన, మనీషాలకు ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు.

చక్కెర కార్మికులకు వేతనాల చెల్లింపునకు అంగీకారం


బోధన్‌: నిజాం చక్కెర కార్మికులకు జీతం బకాయిలు చెల్లించడానికి ఎంపీ కవిత ఆమోదం తెలిపారని తెరాస మైనారిటీ నాయకులు రజాక్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆమెను కార్మికులతో వెళ్లి కలిశామన్నారు. లేఆఫ్‌ కారణంగా జీతాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంపీ ఫోన్‌లో మాట్లాడి బకాయి వేతనాల చెల్లింపునకు అంగీకరించారన్నారు. శక్కర్‌నగర్‌, మెదక్‌, మెట్‌పల్లి యూనిట్ల పరిధిలో మొత్తం 265 మంది కార్మికులు ఉన్నట్టు గుర్తించారని, మార్చి 2018 వరకు 27 నెలల జీతాలు వారికి అందించనున్నారన్నారు. ఈ మేరకు రూ.14.65 కోట్లను ఇప్పించడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ఆర్మూర్‌: 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఆర్మూర్‌ పట్టణ శివారులోని సిద్ధులగుట్ట సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ శివారులోని సుభాష్‌నగర్‌కు చెందిన యోగేశ్‌(19), సునీల్‌(20) అనే యువకులు ద్విచక్ర వాహనంపై ఆర్మూర్‌కు వెళ్తున్నారు. అదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. తమ కాలనీలో ప్రతిష్ఠించిన గణపతి మండపం వద్ద అన్నదానం నిర్వహించటం కోసం అవసరమైన సరకులను తీసురావటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Wednesday, 19 September 2018

ఇంట్లో ఎగ్ బిర్యానీ ఇలా చేసుకోండి.. అది తిన్న ప్రతి ఒక్కరు వావ్ అంటారు మరి !!

ఈ వీడియోలో మన మధుశిక గారు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నారు.. చూసి.. మీ ఇంట్లో వండి.. మీరు కూడా అందరితో వావ్ అనిపించండి మరి...!!

Easy way to do eyebrows @ home | How I do Brows @ home | Best Tweezer

ఇంట్లోనే eyebrows చేసుకొనేందుకు amazon లో ఒక item ని puchase చేసిన మన మధుశిక అది ఎలా ఉపయోగించాలో చెప్తున్నారు చూడండి మరి..

Instant glowing skin at home | Effective skin lightening | Tomato benefits in Telugu | Beauty tips

మెరిసే చర్మం కోసం చాల చాల సింపుల్  వంటింటి చిట్కాను మన మధుశిక చెప్తున్నారు చూడండి మరి..


Tuesday, 18 September 2018

Valuer Of Human Life ? - జీవితం విలువ ఎంత..? | Telugu Motivation Video |

ఈ వీడియోలో "వాయిస్ అఫ్ తెలుగు" naren  గారు చక్కటి వాయిస్ ఓవర్ తో "Valuer Of Human Life ? - జీవితం విలువ ఎంత..? |" అనే విషయంపై  చాలా చక్కగా వివరించారు.. hearty thanks to Naren గారు.
ఆ వీడియో మీకోసం ...

BELIEVE IN YOURSELF - నిన్ను నువ్వే నమ్మాలి | Motivational Video in Telugu |

ఈ వీడియోలో "వాయిస్ అఫ్ తెలుగు" naren  గారు చక్కటి వాయిస్ ఓవర్ తో "BELIEVE IN YOURSELF - నిన్ను నువ్వే నమ్మాలి" అనే విషయంపై  చాలా చక్కగా వివరించారు.. hearty thanks to Naren గారు.
ఆ వీడియో మీకోసం ...


Game of Life, Be Fearless..| భయపడకుండా జీవించు.. life అనే game లో విజయం సాధించు..|

ఈ వీడియోలో "వాయిస్ అఫ్ తెలుగు" naren  గారు చక్కటి వాయిస్ ఓవర్ తో "భయపడకుండా జీవించు.. life అనే game లో విజయం సాధించు" అనే విషయంపై  చాలా చక్కగా వివరించారు.. hearty thanks to Naren గారు.
ఆ వీడియో మీకోసం ...


ఓ నాన్న.. ఓ కొడుకు..చూస్తే కన్నీళ్లాగవు | A Very touching video.About Father and son |

ఈ వీడియోలో "వాయిస్ అఫ్ తెలుగు" naren  గారు "ఓ నాన్న.. ఓ కొడుకు" ఓ చక్కటి motivational స్టోరీని   చక్కటి వాయిస్ ఓవర్ తో  చాలా చక్కగా వివరించారు.. hearty thanks to Naren గారు.
ఆ వీడియో మీకోసం ...


How to control your mind?? : మనసునే కాదు .. ప్రపంచాన్ని జయించండి ఇలా.. !!

ఈ వీడియోలో "వాయిస్ అఫ్ తెలుగు" naren  గారు చక్కటి వాయిస్ ఓవర్ తో ప్రతి వ్యక్తి  తన మనసునే కాదు .. ప్రపంచాన్ని ఎలా జయించాలో చాలా చక్కగా వివరించారు.. hearty thanks to Naren గారు.
ఆ వీడియో మీకోసం ...

Monday, 17 September 2018

అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు


దోమకొండ: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు రివాల్వింగ్‌ ఫండ్‌ అందిస్తామని విధాన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. దోమకొండలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెరాస ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టానుసారంగా వాగ్దానాలు చేస్తూ..ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, దళితునికి ముఖ్యమంత్రి పదవి.. ఇలా ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.5 లక్షల ప్రమాద బీమా, ప్రతివ్యక్తికి 7 కిలోల సన్న బియ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, దళితులకైతే రూ.6 లక్షలు, అభయ హస్తం, బంగారు తల్లి పథకం కొనసాగింపు, సంవత్సరానికి ఆరు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితం, బీడీలపై సుంకం తగ్గింపు వంటివి చేస్తామని వివరించారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గపు సభ్యుడు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు నల్లపు అంజలి, సాహెబుగారి కవిత, బాలవ్వ, జనార్ధన్‌రెడ్డి, భూమాగౌడ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇవే నా చివరి ఎన్నికలు : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి



బోధన్: రాబోయే ఎన్నికలే తను చివరివని, తరువాత రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు కాంగ్రెస్‌ నాయకుడు, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాలూరక్యాంపు, సాలంపాడ్, పెంటాఖుర్దు, చెక్కిక్యాంపులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే యువకుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టానని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని, ఇందుకు సంబంధించిన శాస్త్రీయ గణాంకాలు తనవద్ద ఉన్నాయన్నారు. నిజాంసాగర్‌ నీటిని బాన్సువాడ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా బోధన్‌ వరకు అందేలా చూడాలన్నారు. సాలూరలో మంజీర నదిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామన్న తెరాస సర్కారు మాట నిలబెట్టుకోలేదన్నారు. తాను మంత్రిగా పని చేసిన సమయంలో సాగునీటి కాలువలను సీసీలుగా మార్చగా, తర్వాతి పాలకులు వాటికి షట్టర్లు బిగించలేదన్నారు. సాలూరక్యాంపులో సుదర్శన్‌రెడ్డిని ఆహ్వానించిన కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన్ను ఎడ్లబండిపై ఊరేగించారు. బండికి కాంగ్రెస్, తెదేపా జెండాలు కట్టడం చర్చనీయాంశమైంది. ఎంపీపీ గంగాశంకర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, సీడీసీ మాజీ ఛైర్మన్‌ పోతారెడ్డి, నాగేశ్వర్‌రావు, సైదుల్‌రెడ్డి, సాయిలు, అశోక్, శ్రీనివాస్, ఖలీలుద్దిన్‌ తదితరులున్నారు.

Amit Tiwari: కౌశల్ కన్నింగ్.. బ్యాగ్ సర్దేసిన అమిత్ ‘బిగ్ బాంబ్’




దీప్తి నల్లమోతు సుదీర్ఘ ప్రసంగానికి హడలెత్తిపోయిన బిగ్ బాస్ హౌస్.. నాని పరుగులు.. కంటెస్టెంట్స్ నిద్రలోకి.. ఎలిమినేట్ అయిన అమిత్.. కౌశల్‌పై తీవ్ర వ్యాఖ్యలు.. ఆ ముగ్గురే టాప్ 3.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు నేటి ఎపిసోడ్‌లో..

బిగ్ బాస్ హౌస్‌లో వీకెండ్ వస్తే.. శనివారం నాడు హాట్ హాట్ డిస్కషన్స్‌లో రంజుగా సాగుతుంది. నాని హోస్ట్‌గా హెడ్ మాస్టర్ అవతారంలో ఒక్కో కంటెస్టెంట్‌‌కి మొట్టికాయలేస్తున్న నాని ఆదివారం నాటి 99వ ఎపిసోడ్‌లో ‘నీ మంచికోరి’ అనే సరదా సరదా టాస్క్‌లో ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఈ టాస్క్‌లో భాగంగా తమ తోటి కంటెస్టెంట్‌లో ఉన్న ఏదైతే నెగిటివ్ క్వాలిటీ ఉందో దాన్ని తొలిగించుకుంటే బావుంటుందని భావిస్తారో అలాంటి నెగిటివ్ పదాలు ఆరింటిని సూచించాలని.. ఆ సందర్భంలో కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు నాని.

ఈ గేమ్‌లో భాగంగా.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద, కన్నింగ్, స్వార్థం, అత్యాశ, మాట మీద నిలబడక పోవడం, అహం, రెచ్చగొట్టడం లాంటి పదాల్ని సూచించారు.

ఇక కౌశల్ కళ్లకు గంతలు కట్టి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని.. వాటిని తొలిగించుకుంటే మంచిదంటూ వీటిని సూచించారు. కౌశల్‌కి గురించి ఎవరు ఏమన్నారంటే..


కౌశల్ కన్నింగ్... తనీష్.

కౌశల్‌కి స్వార్ధం.. రోల్ రైడా

కౌశల్‌కి అత్యాశ.. దీప్తి నల్లమోతు

కౌశల్‌ మాట మీద నిలబడడు.. సామ్రాట్

కౌశల్ రెచ్చగొడతాడు.. అమిత్

కౌశల్‌కి అహం ఎక్కువ.. గీతా మాధురి


ఇక గీతా మాధురి గురించి.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద లాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీప్తి నల్లమోతు గురించి ఫేక్‌గా ఆడటం, నస, అత్యుత్సాహం లాంటి నెగిటివ్ కామెంట్స్ రాగా.. ఈ ‘నీ మంచికోరి’ టాస్క్‌లో దీప్తి నల్లమోతు అడిషనల్ షీట్ ప్రసంగాన్ని నానితో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తూనే ఆట పట్టించారు. ఆమె మొదలు పెడితే అసలు ఆపకుండా చేసిన సుదీర్ఘమైన ప్రసంగాలకు హౌస్ మేట్స్ పారిపోయారు. ఇది చాలా సరదాగా సాగింది.

ఈవారం ఎలిమినేషన్‌లో అమిత్ ఔట్..

ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, గీతా, కౌశల్, అమిత్, కౌశల్‌లలో తొలిత సేఫ్ అయ్యింది దీప్తి నల్లమోతు అని కాస్త రిలీఫ్ ఇచ్చారు నాని. ఇక మిగిలిన నలుగురిలో రెండో హౌస్ మేట్‌గా కౌశల్‌ని సేఫ్ చేశారు. మూడో హౌస్ మేట్‌గా గీతా.. నాలుగో హౌస్‌మేట్‌గా రోల్ రైడా సేఫ్ కావడంతో.. మిగిలిన అమిత్ ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి బ్యాగ్ సర్దేశాడు.

టాప్ 3 వీళ్లే.. టైటిల్ వాళ్లు కొడితే హ్యాపీ..


తన దృష్టిలో గీతా మాధురికి మంచి సెన్స్ ఉందని.. చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతుందని, సామ్రాట్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారు. ఇక ఉన్నవారిలో టాప్ 3 ఎవరనే విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురిలు టాప్ 3 అన్నారు. బిగ్ బాస్ టైటిల్ రోల్ రైడా, సామ్రాట్‌‌లు గెలిస్తే బావుంటుందన్నారు. ఇక కౌశల్‌ ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తాడన్నారు. ఆయనలో కన్నింగ్ లక్షణాలు ఉన్నాయన్నారు.

బిగ్ బాంబ్ ఆమెపైనా..

ఇక ఎలిమినేట్ కంటెస్టెంట్‌కి సాంప్రదాయంగా వస్తున్ బిగ్ బాంబ్‌ను దీప్తి నల్లమోతుపై విసిరారు అమిత్. దీని ప్రకారం హౌస్‌లో వారం రోజుల పాటు.. కంటెస్టెంట్స్ అందరి జట్టును దీప్తి మాత్రమే దువ్వాలి.

బట్టలపై ఏర్పడిన మొండి మరకలను తొలగించడం ఎలా ?



మీ బట్టలు మురికిగా తయారవ్వడానికి రకరకాల పదార్ధాలు అనగా ఫుడ్డు, డ్రింక్స్, ఇంక్, లిప్ స్టిక్, ఆయిల్ వంటివి కారణం కావచ్చు. ఒక్కొక్క రకమైన మరకకు - ఒక్కొక్క పరిష్కార మార్గాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీ బట్టలు ఏ రకమైన మెటీరియల్ను కలిగి ఉన్నదో దానిబట్టి మీరు ఎలా శుభ్రం చేస్తారనేదానిపై ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి, మీరు మీకు ఇష్టమైన బట్టలపై మరకలు ఏర్పడినప్పుడు మీరేమి చేస్తారు ? మీ బట్టలపై ఏర్పడిన వివిధ రకాల మరకలను తొలగించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

వేర్వేరు బట్టలు మీద ఉన్న మరకలను ఎలా అరికట్టాలి ?

మీరు బట్టలపై ఏర్పడిన మరకలను అరికట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు, మీరు బట్టలు ఎలాంటి మెటీరియల్ను కలిగి ఉన్నాయో కొంచెం ఆలోచించండి (అది కాటన్, సింథటిక్, ఉన్ని (లేదా) పట్టుకి సంబంధించినదా అని). ఇది మీ బట్టలపై ఏర్పడిన మరకలను ఎలా తొలగించాలో అన్న దానిపై ప్రభావమును చూపుతుంది. ఇలా ఏదైనా మీరు ట్రై చేయటానికి ముందు, మీ బట్టలపై ఉన్న లేబుల్ సూచించే సూచనలను, మార్గదర్శకాలను మీరు తప్పక అనుసరించండి.

కాటన్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

కాటన్ అనేది చాలా మన్నికైన ఫాబ్రిక్, కాబట్టి మీరు ఈ ఫాబ్రిక్ను ఎలాంటి నష్టం వాటిల్లకుండానే మరకలను తొలగించడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించవచ్చు.

సింథటిక్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

మనము ధరించే వాటిలో అనేక రకాలైన సింథటిక్ వస్త్రాలు ఉన్నాయి, అవి సాధారణమైన మన్నికగలవి, కాబట్టి మీరు మరకలను తొలగించే పని చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తరచుగా సింథటిక్ ఫాబ్రిక్స్ను శుభ్రం చేయడానికి, ఎంజైములు కలిగి ఉన్న సాధారణ డిటర్జెంట్లకు బాగా స్పందిస్తాయి, కానీ బ్లీచ్ వంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించడం మంచి ఆలోచన కాదు.
సింథటిక్ బట్టలపై ఉన్న మరకలను తొలగించడం కోసం మీరు ఉపయోగించే స్టెయిన్ రిమూవర్లు సురక్షితంగా ఉన్నాయా / లేవా అని ముందుగా తనిఖీ చేసుకోండి.

ఉన్ని బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

మార్కెట్లో లభించే అనేక వాణిజ్యపరమైన స్టెయిన్ రిమూవర్లు, ఉన్ని ఫైబర్లను నష్టపరుస్తాయి, కనుక లేబుల్పై ఉన్న సూచనలను తప్పకుండా చదవండి.
పెర్సిల్ సిల్క్ & ఉన్ని వంటి మెటీరియల్ కొరకు రూపొందించిన నిర్దిష్టమైన డిటర్జెంట్లను ఉపయోగించండి, ఆపై మీ బట్టలను పొడిగా మార్చడం వల్ల సరైన ఆకారంను తిరిగి పొందగలదు. అవసరమైతే, స్పెషల్ గార్మెంట్ స్టెయిన్ చికిత్స కోసం ఒక ప్రొఫెషనల్ డిటర్జెంట్ను తీసుకోండి,

సిల్క్ బట్టల నుండి మరకలను తొలగించడం ఎలా ?

మీరు ఒక చిన్న మరకలను నివారించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సిల్క్ మీద సరైన డిటర్జెంట్ను ఉపయోగించడం ముఖ్యం, ఆ మరకలను తొలగించడానికి మొత్తం వస్త్రాన్ని నానబెట్టాలి. సిల్క్ నమ్మశక్యం కానంత సున్నితమైనది, కాబట్టి కఠినమైన మరకలను తొలగించడానికి డ్రై క్లీనర్ల సహాయం తీసుకోండి.

సాధారణ మరకలను తొలగించడానికి పాటించవలసిన హోం రెమిడీస్ !

అన్ని రకాల మరకలను తొలగించబడెలా ఉన్న స్టెయిన్ రిమూవర్స్ కోసం మనమంతా పరుగులు తీస్తాము. కానీ మీ ఇంట్లో ఉన్న కొన్ని పదార్ధాలు ఈ మరకలను తొలగించటానికి కూడా సహాయపడతాయి. ఇలాంటి పద్ధతుల్లో మీరు పాటించేటప్పుడు మీ బట్టల పై ఉన్న రంగులు అస్పష్టంగా గాని, పూర్తిగా గాని తొలగిపోవని మీరు ముందుగా నిర్ధారించుకోండి. అందుకోసం మీరు ఒక గార్మెంట్స్ నిపుణుడి సలహాను తీసుకోవచ్చు.

పాలతో చాక్లెట్ మరకలను తొలగించడం :-

మొదటగా, ఆ బట్టలను ఫ్రీజర్లో ఉంచడం ద్వారా ఆ మరకలను గట్టిపడేలా చేయవచ్చు, ఆ తరువాత ఆ చాక్లెట్ను స్క్రాప్ చేయడం ద్వారా ఏ చాక్లెట్ మరకలను తొలగించవచ్చు. ఆ తరువాత, చాక్లెట్ మరకలు ఉన్న బట్ట వెనుక భాగంలో వేడి నీటిని పోయడం వల్ల, ఆ మరకలను కరిగిస్తుంది. ఆ మరకలను డిటర్జంట్ను కడిగిన తర్వాత, ఆ బట్టలను 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు పాలులో నానబెట్టండి.

టమాటా మరకలు ఈ విధంగా తొలగించండి :-

మీ బట్టలను సాధారణంగా వాష్ను చేయండి, అవసరమైతే మళ్ళీ మళ్ళీ వాష్ను చేయండి. వినెగార్తో టమోటా మరకలను తొలగించండి తెల్లని వినెగర్ (1 - 2 టేబుల్ స్పూన్) లో 30 నిమిషాల పాటు మీ బట్టలను నానబెట్టండి. ఆపై మీ బట్టలను వాషింగ్ మిషన్లో ఉతికేముందు డిటర్జెంట్తో నేరుగా మరకలను వాష్ చేయండి. అవసరమైతే మళ్లీ మళ్లీ మీ బట్టలను వాష్ చేయండి.\

హేస్ప్రేని ఉపయోగించి ఇంక్ మరకలను తొలగించండి :-

ఇంక్ మరకలను తొలగించడానికి ఇది చాలా గమ్మత్తైనదిగా ఉంటుంది. మిథైల్ ఆమ్లం (లేదా) హేర్ప్రెస్ వంటి ఒక ఆల్కహాల్-ఆధారిత ఉత్పత్తులలో మీ బట్టలను నానబెట్టండి, ఇది చాలా అద్భుతమైన పరిష్కార మార్గంగా ఉంటుంది. మీ బట్టలు పై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోయే వరకు మీ బట్టలను డిటర్జెంట్ నీటిలో నానబెట్టండి. ఒకవేళ మీ బట్టలు రంగును కోల్పోయేటట్లయితే సాధారణంగానే వాష్ చేయండి.

లిక్విడ్ డిష్వాషింగ్తో ఆయిల్ మరకలను తొలగించండి :-

నూనె వంటి అనేక జిడ్డైన మరకలను డిష్వాషింగ్ లిక్విడ్తో (లేదా) వాషింగ్ డిటర్జెంట్లను నేరుగా మీ బట్టలపై అప్లై చేయడం వల్ల మీరు లాభం పొందవచ్చు. అవసరాన్నిబట్టి వాషింగ్ మిషన్లో మళ్ళీ మళ్ళీ మీ బట్టలను వాష్ చేయండి.
ఉప్పుతో రక్తపు మరకలను తొలగించండి :-

మీ బట్టల పై ఏర్పడిన రక్తపు మరకలను ఈ పద్ధతిలో తొలగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఉప్పు మరియు చల్లని నీటితో మీరు ఒక పేస్ట్ను తయారు చేయాలి. రక్తపు మరకలు ఏర్పడిన 10-15 నిమిషాల్లోనే, ఆ పేస్ట్ను మరకలపై నేరుగా రుద్దండి. ఆ తర్వాత చల్లటి నీటితో మీ బట్టలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటివి చిట్కాలను ఉపయోగించి మీ బట్టలు పై ఏర్పడిన మొండి మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.