Friday, 28 April 2017

ప్రేమించి, పెళ్లికి నిరాకరించాడని...పురుగుమందు తాగిన యువతి

ఏప్రిల్ 29, నిజామాబాదు వార్త :
ప్రేమించిన యువకుడు పెళ్ళికి అంగీకరించకపోవడంతో బాధితురాలు చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... రేపల్లెకు చెందిన సరోజిని, చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన సామ్రాట్‌ గత కొంతకాలం ప్రేమించుకున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే సామ్రాట్‌ పెళ్ళికి అంగీకరించకపోవడంతో సరోజని చేబ్రోలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరి పెద్దలతో మాట్లాడి పెళ్ళి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పెళ్ళికి సామ్రాట్‌ అంగీకరించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 108 సహాయంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఎస్సై బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment