Friday, 4 November 2016

యజమాని కొట్టాడని యువకుడి
ఆత్మహత్యాయత్నం
facebookలో ఆత్మహత్యకు గల కారణాల వీడియో

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:


నగరంలోని కోజా కాలనీకి చెందిన ఆంజద్ హుసేన్ అనే యువకుడు శుక్రవారం విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన యజమానితో పాటు ఆతని కుమారులు వేధిం చటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు facebook లో ఆత్మహత్యాయత్నానికి ముందు జరిగిన విషయాలను వెల్లడిస్తూ.. వీడియోను అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఘటనపై ఇంతవరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment