Thursday, 3 November 2016

డిజిటల్ తరగతులకు సిద్ధం

నిజామాబాద్ వార్త.కామ్: 
డిజిటల్ తరగతుల నిర్వహణకు జిల్లాలో 114 ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాల సిద్ధంగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ తెలిపారు. గురువారం విద్యాశాఖ సంచాలకులు కిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. నిజామాబాద్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు సంబంధించి పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. జిల్లాలో 185 ఆర్దోటీస్ 114 టీవీలు, 221 ఎల్సీడీ, ప్రాజెక్టర్లు, 94 కంప్యూటరు පටඨඤට්ඨඒ* ఉన్నాయని తెలిపారు. ఆదేశాలు అందగానే తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.జిల్లాకు నలుగురికి శిక్షణప్రతీ జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులకు డిజిటల్ తరగతులపై ఈ నెల 5వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ సంచాలకులు కిషన్ తెలి పారు. ముఖ్యంగా కంప్యూటర్పై అవగాహన ఉన్న గణితశాస్త్రం, సామాన్య సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులను జిల్లాల నుంచి పంపాలన్నారు. అలాగే కొన్ని చోట్ల ఆర్వోటీస్ లేనిచోట కేబుల్ ద్వారా కూడా మన టీవీని వీక్షించవచ్చన్నారు. ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అన్ని అందుబా టులో ఉన్నాయని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేబుల్ ద్వారానే పాఠ్యాంశాల బోధన కొనసాగుతుందన్నారు.

No comments:

Post a Comment