Wednesday, 2 November 2016

ఈ-హాస్పిటల్ పనులను త్వరగా పూర్తిచేస్తాం; కలెక్టర్
నిజామాబాద్ వార్త: జవాబుదారి తనం, బాధ్యతతో పేదలకు వైద్య సేవలు అందించి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో నిజామాబాదు జిల్లా ఆస్పత్రిని త్వరలోనే ఈహాస్పిటల్గా మార్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తా మని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. బుధవారం ఎన్ఐసీలో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా మెరుగైన సేవలు రోగికి అందించే విధంగా రూపొందించిన మాడ్యూల్ ను పరిశీలించారు.
ఈ-ఔషది, ఈ-హాస్పిటల్ నూతన సంవత్సరంలోపు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్న టు తెలిపారు. ఇహాస్పిటల్ ద్వారా సిబ్బంది ద్వారా రోగులకు మెరుగైన సేవలు సకాలంలో అందించడా నికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ-హాస్పి టల్ ద్వారా రోగి ఇన్ పేషంట్ అవుట్ పేషంట్ సంబంధించిన వివరాలు, ల్యాబ్ రిపోరులు, ఉపయోగించిన మందులు, రోగికి రెఫర్ చేసిన డాక్టర్ల వివరాలు పొందుపర్చబడి ఉంటాయని, రోగికి ఆన్లైన్ ద్వారా సంబంధిత డాక్టర్ను కలుసుకునేందుకు, సమయాన్ని నిర్ణయించుకోవడానికి, వీలుపడుతుందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రకాల మాడ్యుల్లను ఇతర రాప్రాలలో అమలు పరుస్తున్న విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మన జిల్లాలో ఏర్పాటు చేయడానికి నిర్ణ యం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీ ఎంఅండ్ హెచ్.వో డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ రాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతి మ, ఆడిట్ అధికారి రాముతో కలిసి వీడియో కాన్స రెన్స్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment