Thursday, 3 November 2016

రబీ పంటలకు సరిపడా నీరు అందజేయాలి

-వీసీలో మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

నిజామాబాదు వార్త.కామ్:

చెరువులు, ప్రాజెక్టుల కింద అవసరమైనంత నీటిని రబీ పంటకు అందజేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి దూరదృశ్య సమీక్ష ద్వారా ఆయన జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్లో జిల్లా పాలనాధి కారిణి యోగితారాణా, జేసీ రవీందర్రెడ్డి, తదితరులతో సమీక్షించారు. సీజన్ ప్రారంభమైన నేపధ్యంలో ఎంత నీరు అవసరముంటుందనే విషయంపై అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల్లో నీటి లభ్యత ఎంత ఉందనే దానిపై పర్యవేక్షిం చాలన్నారు. చెరువు శిఖం భూములు కట్టాకు గురవుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించాలని సూచించారు. ఉన్న సిబ్బంది సరిపోకుంటే అవసరమైతే విశ్రాంత రెవెన్యూ సర్వేయర్ల సాయంతో హద్దులు గుర్తించాలని ఆదేశించారు.

No comments:

Post a Comment