Saturday, 5 November 2016

చిత్రలేఖనం.. శాస్త్రీయనృత్యం..సృజనాత్మకం

  • ప్రతిభ చాటుతున్న చిన్నారులు
  • బాలసూర్య బాలరత్న పోటీలకు స్పందన

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

దేశరక్షణలో సైనికుల వీరత్వాన్ని కాన్వాస్ పై ఇందూరు చిన్నారులు ఆవిష్కరించారు. బుడిబుడి నడకలతో శాస్త్రీయ, జానపద నృత్యాభినయంలో సత్తా చాటుకున్నారు. సృజనాత్మక రచన, ఉపన్యాసం, వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి బాలసూర్య బాలరత్న పురస్కారాలకు సృజనాత్మక రచన, చిత్రలేఖనం, ప్రదర్శన(నృత్యం, గాత్రం), విజ్ఞానశాస్త్రం విభాగాల్లో పోటీలను నిర్వహించారు. హైదరాబాద్ జవహర్ బాలభవన్కు చెందిన కిషన్ పరిశీలకులుగా హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా శాంతికుమార్, రాజ్యలక్ష్మీ జయలక్ష్మీ, ఉమాబాల, పుష్పలతతో పాటు బాలభవన్ పర్యవేక్షకులు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలభవన్ ప్రాంగణమంతా చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వా హకులు మాట్లాడుతూ. విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 1న హైదరాబాద్లో జరిగే రాష్టసాయి పోటీల్లో ప్రతిభ చాటి ఇందూరుకు గౌరవం తీసుకురావాలని పేర్కొన్నారు. 
విజేతల వివరాలు: 

  • * నృత్యం విభాగంలో మనస్విని(అపూర్వ పాఠశాల, నిజామాబాద్), ఉత్తమ అభిజ్ఞ(విజయసాయి బో ధన్). * సృజనాత్మక ప్రదర్శన(నృత్యం)లో ప్రీతి(వాసవి ఉన్నత పాఠశాల, నిజామాబాద్), అఖిల(శ్రీనిధి నిజామాబాద్), * గాత్రం విభాగంలో సమన్విత(విజయ్ ఉన్నత పాఠశాల, నిజామాబాద్), ప్రియాంక (కేజీబీవీ, మోపాల్). * సృజనాత్మక కళ (చిత్రలేఖనం)లో సుధాకర్(జడ్పీహెచ్ఎస్, అమ్రాద్), ఐశ్వర్య (కేజీబీవీ, మోపాల్). * సృజనాత్మక రచనలో సులోచన (టీఎస్డబ్యూఆర్ఎస్జేసీ, ధర్మారం), నిఖిత (కేజీబీవీ మోపాల్). * సృజనాత్మక వైజ్ఞానిక ప్రయోగంలో కావేరి(టీఎస్డబ్యూఆర్ఎస్ ధర్మారం). * సృజనాత్మక కళ(చిత్రలేఖనం-ప్రత్యేక విభాగం)లో గీత(టీఎస్డబ్యూఆర్ఎస్ ధర్మారం)

No comments:

Post a Comment