Thursday, 3 November 2016

'కేంద్రీయం' సరే ... 'నవోదయం' రావాలి మరి ... 

నిజామాబాద్ వార్త.కామ్:

జిల్లా పునర్విభజనతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యావనరుల్లో సైతం విభజనతో మార్పులొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిర్వహణ విద్యా సంస్థల విభజన మాత్రం రెండు జిల్లాలకు చెరొకటి అన్నచందంగా వేరుపడ్డాయి. నిజామాబాద్ జిల్లాకు కేంద్రీయ విద్యాలయం దక్కగా. కామా రెడ్డికి నవోదయ విద్యాలయం సొంతమైంది. ప్రస్తుతం రెండు జిల్లాలకు చెరొక కేంద్ర మానవ వనరులశాఖ నిర్వహణలోని విద్యాలయాల ఆవశ్యకత ఉంది. సీబీఎస్ఈ సిలబస్ కొనసాగించే ఈ విద్యాలయాలల్లోని అభ్యాసంపై ప్రజల్లో ఎంతో విశ్వాసం. అందుకే వీటిల్లో ప్రవేశాలకు పోటీ విపరీతంగా ఉంటోంది. జిల్లాల విభజనతో పరిధి తగ్గిన ఫలితంగా ఎక్కువ మంది స్థానికులు ప్రవేశాలు పొందడానికి ఆస్కారమేర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కారు అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లాకు దూరమైన నవోదయతోపాటు మరో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రతిపాదనలు పంపాలనే డిమాండు వినిపిస్తుంది. ఒకేసారి రెండు విద్యాలయాలు మంజూరయ్యే ఆస్కారముందనే ఆలోచనా ఉంది.
ఇదీ నవోదయ పరిస్థితి.
మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన నవోదయ విద్యాలయం జిల్లాకు 1984లో నిజాంసాగర్ మండలంలో ఏర్పాటు చేశారు. 80 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన విద్యాలయంలో ప్రతి ఏటా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవే శానికి పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఈ పరీక్షకు కనీసంగా ఏటా 8 వేలకు తగ్గకుండా పోటీపడుతుంటారు. ఆర్మూర్ డివిజన్, నిజామాబాద్ గ్రామీణ మండలాల నుంచి ఎక్కువ మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందుతుంటారు. 10+2 విధానంలో కేంద్రీయ సిలబస్లో విద్యార్థులు చదువుకుంటారు. మొత్తం 540 మంది విద్యార్థులకు వసతి సదుపాయంతోపాటు విద్యను ఒకే ప్రాంగణంలో అందిస్తారు. పూర్వ నిజామా బాద్ జిల్లాలోని 86 మండలాల పరిధిలోని విద్యార్థులు ఈ విద్యాలయం కోసం పోటీపడేవారు. ఇప్పుడు భౌగోళికంగా కామారెడ్డి జిల్లాలోకి నిజాంసాగర్ మండలాన్ని చేర్చడంతో నవోదయ విద్యాయం ఆ జిల్లాకే వెళ్లిపోయింది.
ఈసారి రెండు జిల్లాలకు కలిసి.
నవోదయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పాత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి ప్రవేశం కోసం $240 మంది విద్యార్థులు 80 సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

No comments:

Post a Comment