Friday, 4 November 2016


రూ. కోటి వ్యయంతో స్మృతి వనం
-అమృత్ పథకం కింద నిధులు మంజూరు
నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:
నగరంలో మరో స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏకంగా రూ కోటి వ్యయంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నగర వాసులకు ఆహాద వాతవరణం కల్పించేందుకు ఈ వనం ఎంతో ఉపయోగపడుతుంది. నగరంలోని వినాయక్నగర్లో ప్రస్తుతం స్మృతి వనం ఉండగా నూతనంగా గౌతంనగర్లో మరోటి ఏర్పాటు కానుంది.
నగరం అమృత్ పధకం కింద ఎంపికైన విషయం తెలిసిందే. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లలో నిధులు వస్తాయి. ఇప్పటికీ మన వాటా మనకు ఇచ్చేశారు. రెండు విడతల్లో రూ.50 కోట్లకు పైగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నీటి ట్యాంకుల నిర్మాణం, కొత్తగా పైపులైన్ల ఏర్పాటు, నీటి పైపుల లీకేజీ, నీటిని పద్ధి చేయడం వంటి వాటి కోసం ఆ నిధులను వెచ్చించాలి. దీంట్లో భాగంగానే ఒక స్మృతివనంను అభివృద్ధి చేసేందుకు ఇందులో అవకాశం కల్పించారు. దీనికి గాను నగరానికి అమృత్ పధకంలో భాగంగా రూ.102 కోట్ల మంజూరు అయ్యాయి. ఈ నిధులతో నగరంలోని గౌతంనగర్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు.
అన్నీ సౌకర్యాలతో అభివృద్ధి
నగరంలోని గౌతంనగర్లో పేర్పాటు చేసే వనంలో ఆన్నీ సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసేందుకు అధికారులు చూస్తు న్నారు. అందమైన చెట్లు, నడక కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. మొక్కలను, గడ్డిని రక్షించడానికి బోరు వేయనున్నారు. వృద్దులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేస్తారు. పిల్లల కోసం ఆట వస్తువులను ఉంచనున్నారు. వీటితో పాటు వనంను కాపాడేందుకు కాపలాదారుడిని నియమించనున్నారు. గౌతంనగర్తో పాటు దాని పక్కల ప్రాంతాలైన చంద్రశేఖర్ కాలనీ, దుబ్బ కంటేశ్వర్, సుభాష్నగర్ ప్రాంతాల వారికి నూతనంగా ఏర్పాటు చేసే స్కృతివనం ఎంతో ఉపయోగపడనుంది.
త్వరలోనే టెండర్ నిర్వహిస్తాం
-సరోజ రాణి, ఎస్ఈ, కార్పొరేషన్

అమృత్ పథకం కింద స్మృతివనం ఏర్పాటు కోసం రూ. 102 కోట్ల మంజూరు అయ్యాయి. సాంకేతిక అనుమతులు వచ్చిన తర్వాత టెండర్ నిర్వహిస్తాం నగరంలోని గౌతంనగర్లో దీనిని ఏర్పాటు చేసేందుకు స్థలం ఎంపిక చేశారు.

No comments:

Post a Comment