Thursday, 3 November 2016

కమిషనరేట్లో 'టాస్క్ఫోర్స్
* ఏర్పాటు దిశగా సన్నాహాలు
* ఏసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
-నిజామాబాదు వార్త.కామ్:
నిజామాబాద్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ ඩීබෘ(රට ఏర్పాటు కాబోతోంది. అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబం ధించి అధికారులు శరవేగంగా పావులు కదుపుతున్నారు. టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేసేందుకు తగ్గట్టుగా సిబ్బంది ఉండేలా చూస్తున్నారు. అరులైన వారి జాబితాలు కూడా తెప్పించుకుంటున్న అధికారులు అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.గత నెలలో దసరా పండగ రోజున నిజామాబాద్ కమిషనరేట్ రూపాంతరం చెందింది. అధికారికంగా కమిషనరేట్ ఏర్పడినా.. అన్ని రకాల విభా గాలు అందుబాటులోకి రాలేదు. మొత్తం 29 రాణాలు, మూడు సబ్ డివిజన్లతో కమిషనరేట్ ఏర్పాటైంది. కమిషనరేట్ అంటే ప్రధానంగా టాస్క్ఫోర్స్ విభాగమే. క్షేత్రస్థాయిల్లో జరిగే అక్రమ రవాణాతో పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగే అన్ని కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ విభాగం పనిచే స్తుంది. అయితే కమిషనరేట్ ఏర్పడినా. సిబ్బంది కొరత ఉండటంతో ఇన్నాళ్లు దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టలేదు. కానీ, కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణాతో పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగే అన్నిరకాల కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ఫోర్స్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకరావటమే సరైన మార్గంగా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే కసరత్తు కూడా శరవేగంగా జరుగుతోంది.సిబ్బంది కోసం జల్లెడ టాస్క్ ఫోర్స్లో పనిచేయటానికి దీటైన సిబ్బంది నియమించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాణాల వారీగా ఉన్న అనుభవజ్ఞులైన సిబ్బంది జాబితాను సేకరిస్తున్నారు. ఐడీ పార్టీ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్నవారితో పాటు గ్రేహౌండ్స్లో పనిచేసిన వారు, దొంగల మురాలో పట్టుకోవటంలో ప్రావీణ్యం ఉన్నవారిని ఎంచుకొని మరీ టాస్క్ఫోర్స్ను బలోపేతంగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.ఏసీపీ స్థాయి అధికారి టాస్క్ఫోర్స్ విభాగాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో నడిపించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికప్పుడు ఏసీపీని ప్రభుత్వం కేటాయించని పక్షంలో ఉన్న ఏసీపీలకు అదనపు బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సీఐ, ఇద్దరు ఎస్బెలతో పాటు కొంత మంది సిబ్బందిని కేటాయించి టాస్క్ ఫోర్స్ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. కమిషనరేట్ పరిధిలో అంతటా తనిఖీలు చేసే అధికారం వీరికి కల్పించనున్నారు. మెజిస్టీరియల్ అధికారాలతో కమిషనరేట్గా ఏర్పాటైన వెంటనే మెజిస్టీరియల్ అధికారాలు కమిషనర్ చేతిలోకి వచ్చాయి. గతంలో మాదిరిగా పలు ఆంశాల్లో రెవెన్యూ అధికా రుల అనుమతి లేకుండానే తక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. పీడీ యాక్టుతో పాటు లారీఛార్టీలు, తనిఖీలు, దాడులు చేసే అధికారం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకొని గంజాయి, గుట్కా, ఇసుక అక్రమ రవాణాతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా అనిపించే వాటిని కట్టడి చేయాలన్నది సీపీ ప్రధాన వ్యూహం.

No comments:

Post a Comment