Wednesday, 2 November 2016నిజాంషుగర్స్ భవితవ్యంపై సీఎంతో చర్చ
  • చెరకు రైతులకు ఎంపీ కవిత హామి
  • కర్మాగారంపై ఎమ్మెల్యేలు, రైతుల అభిప్రాయాల సేకరణ


నిజామాబాద్ వార్త: నిజాంషుగర్స్ అంశంపై సీఎం కేసీఆర్ ను కలిసి త్వర లోనే అన్ని వివరాలను తెలియజేస్తానని ఎంపీ కవిత తెలిపారు. బుధవారం హైదరాబాద్లో నిజాంషుగర్స్ కర్మాగారం భవితవ్యంపై చర్చించారు. నిజాంషుగర్స్ కర్మాగారం పరిధిలోని శక్కర్నగర్, మెట్పల్లి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు, చెరకు రై తులతో ఆమె బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, రైతుల అభిప్రాయాలను ఆమె పరిగణలోకి తీసుకున్నారు. నిజాంషుగర్స్ కర్మాగారా న్ని ప్రారంభిస్తే ప్రభుత్వం నడపడమా? సహకార రంగంలో రైతులకు అప్పగించడమా? అన్న అంశంపై చర్చించారు. ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం కర్మాగారాన్ని పూర్తిగా వదులుకున్న తర్వాత న్యాయపర మైన చిక్కులు రాకుండా, అన్ని అంశాలను కొలిక్కి తెచ్చిన తర్వా త కర్మాగారం నడిపే అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో రైతులతో చర్చించారు. చెరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కవిత భరోసా ఇచ్చారు. మూడు కర్మాగారాల పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిజాంషుగర్స్ చక్కెర కర్మాగారం మూతపడి, ఈ దుస్థితి ఏర్పడిందని రైతులకు వివరించారు. మూతపడిన నిజాంషుగర్స్ ఫ్యా క్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆమె చెప్పారు. రైతులు సహకార సంఘంగా ఏర్పడి కర్మాగారం నడిపేందుకు ముందుకు వస్తే బాగుంటుందని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె అన్నారు. మెట్పల్లి, మెదక్ కర్మాగారం పరిధిలోని ఎమ్మె ల్వేలు తమ రెండు యూనిట్లను సహకార రం గంలోనే నడపాలని రైతులు తీర్మానించుకున్న టు తీర్మాన పత్రాలను అందజేశారు. బోధన్ శక్కర్నగర్కు చెందిన రైతులు మాత్రం త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. మూడు కర్మాగారాల పరిధిలో అక్కడి రైతులతో క్షేత్రస్తాయిలో మరోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. చెరకు రైతుల అబిప్రాయాల ను, కర్మాగారం పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, నిజామాబాదు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, చెరకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్రెడ్డి, బోధన్ ప్రాంత చెరకు రైతులు అప్పిరెడ్డి, శివ రాజ్ పటేల్, బుదైరాజేశ్వర్, కోట గంగారెడ్డి, మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి, మందర్నా రవి, టీఆర్ఎస్ నాయకులు సాలూర షకీల్, రఫీ, చెరకు రైతులు మారుతీ రావు పటేల్, ఖాజాపూర్ గంగాధర్, మర్కల్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment