Wednesday, 2 November 2016

మావోయిస్టు బంద్

పోలీసుల అప్రమత్తం 

సరిహద్దు ప్రాంతాలపై దృష్టి 

ప్రజాప్రతినిధుల అప్రమత్తం


మావోయిస్టు రాష్ట్ర బంద్ పిలుపుతో ఇటు నిజామాబాద్ అటు కామారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల పరిధిలో గట్టి నిఘా పెట్టారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసుస్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. ఆంద్రా, ఒరిస్సా సరిహద్దులో వారం క్రితం జరిగిన బేజ్యంగి ఎన్కౌంటర్లో మృతి చెందిన నక్షల్స్ కు నిరసనగా మావోలు ఈ నెల 3న రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజలు ఈ బంద్ కు మద్ద తివ్వాలని కోరారు. ఒరిస్సా ఎన్కౌంటర్ తర్వాత జిల్లా పోలీసులు అప్ర మత్తం అయ్యారు. మాజీలు సానుభూతిపరులపై దృష్టిపెట్టారు. జిల్లాలో దశాబ్దకాలంగా ఎలాంటి సంఘటనలు జరుగలేదు. జిల్లాలో మావోల కార్యక్రమాలు లేవు. రెండు దశాబ్దాల క్రితం ఉత్తర తెలంగాణలో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉండేది. కరీంనగర్ పశ్చిమ జిల్లా పేరుమీద నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమాలు జోరుగా సాగేవి. ప్రజాప్రతినిధులకు కునుకులేకుండా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు కామారెడ్డి, ఇందల్వాయి, బీంగల్, సిరికొండ దళాల పేరుమీద కార్యక్రమాలు కొనసాగాయి. పెద్దఎత్తున సానుభూతి పరులు ఉండేవారు. వైఎస్ సీఎం అయిన తర్వాత చర్చల అనంతరం జరిగిన పరిణామాలతో ఉత్తర తెలంగాణలో దళాలు మొుత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఉన్నవారు సైతం ఛత్తీస్ఘడ్కు వెళ్లి పోయారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. చత్తీ ష్ఘడ్ మహారాష్ట్ర సరిహద్దులలోని ఆసీఫాబాద్, మంచిర్యాల్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని గోదావరి వెంట అప్పడు అప్ప డు తప్పిస్తే మావోల కార్యక్రమాలు లేవు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆంద్రా, ఒరిస్సా సరి హద్దులో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత దొరికిన సమాచారం ఆధారంగా తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు జిల్లాలో అన్ని చర్యలను పోలీసులు చేపట్టారు. సరిహదు ప్రాంతాల్లో నిఘాపెట్టారు. వాహనాల తనిఖీలను చేస్తున్నారు. పాత గ్రామాలపైన దృష్టిపెట్టారు. మావోల కార్యక్రమాలు జిల్లాలో లేకున్నా ఎలాంటి సంఘటనలు జరుగకుండా కటుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రధాన రహదారులు, అటవీ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఆంద్రా, ఒరిస్సా సరిహదుల్లో సంఘటన జరగడం వల్ల జిల్లాలో బంద్ ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. రాష్ట్ర అధికారుల సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్ పోలీస్ కార్తికేయ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

No comments:

Post a Comment