Wednesday, 2 November 2016

ధర్మారం(బి) గురుకులంలో 
వైజ్ఞానిక ప్రదర్శనలు

డిచ్పల్లి (నిజామాబాదు వార్త): ధర్మారం (బి) ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 7నుంచి 9వరకు జోనల్ స్తాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు జరుగనున్నాయని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. బీట్ బ్యాంక్ 2016 పేరుతో జరుగనున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల 50 సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 200 మంది విద్యారులు పాల్గొంటారన్నారు. ప్రదర్శనలో ఏరోడైనామిక్స్, ఐడ్రో డైనామిక్స్, బయోటెక్నాలజీ, శుద్ధ గణితం, సంగీతం, సాహిత్యం ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొవడం వంటి అంశాలపై దాదాపు 100 ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ కోరారు.

No comments:

Post a Comment