Saturday, 5 November 2016

నగరంలో మైనింగ్ అధికారుల తనిఖీలు

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు టిప్పర్లు సీజ్

నవంబర్ 6, నిజామాబాద్ వార్త.కామ్:
నిజామాబాద్ నగరంలోని మైనింగ్ అధికారులు, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు శనివారం సంయుక్త తనిఖీలు జరిపారు. జిల్లా కలెక్టర్ యోగితారాణా ఆదేశాలనుసారం తనిఖీలు జరపగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు. వర్ని మండలం నుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో నాగారం వద్ద తనిఖీలు నిర్వహించగా. నాలుగు టిపర్లు పట్టుబడ్డాయి. మైనింగ్ ఏడీ సత్యనారాయణరెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ అధికారి జగన్నాథ్రెడ్డిలు నివేదిక తయారు చేసి ఐదో రాణాలో ఫిర్యాదు చేశారు. మైనింగ్ అధి కారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నాలుగు టిప్పర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇసుకను ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే సమాచారం తేలాల్సి ఉంది.

No comments:

Post a Comment