Saturday, 5 November 2016

ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి: మంత్రి హరీష్ రావు

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, దానికి తోడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అభివృద్ధి కోసం పట్టుబట్టి పనులు తీసుకు వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో శనివారం రూ. 19, 28 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఎల్లారెడ్డిలో మార్కెట్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకా రమహోత్సవానికి వచ్చిన మంత్రికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంబెడ్కర్, ఐలమ్మ, గాంధీ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈసందర్భంగా మంత్రిని స్థానిక ప్రజా సంఘాలు, కులసంఘాల వారు ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.13 కోట్లతో నిర్మించిన గురు కుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డి శివారులో నాలుగులైన్ల రోడ్డు పనులకు రూ. 5 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. ఆదర్శ పాఠశాలలో రూ.1.28 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు.

No comments:

Post a Comment