Saturday, 5 November 2016

పోటాపోటీగా హాకీ పోటీలు
నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న మొదటి తెలంగాణ రాష్ట్ర సాయి మహిళల హాకీ టోర్నీ ఎంపీ కప్ క్రీడాభిమానులను విశేషంగా అలరిస్తోంది. జట్లన్ని హోరాహోరీగా తలపడుతుండడంతో మైదానానికి అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆటలను తిలకిస్తున్నారు. శనివారం ముఖ్య అతిథులుగా ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్కుమార్, సీనియర్ క్రీడాకారులు మహేందర్ రెడ్డి, రఘురాం, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు రాజయ్య నేత హాజరై క్రీడాకారిణులను అభినందించారు. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో గ్రూప్ చివరి దశ మ్యాచ్లు జరగగా రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ జట్ల సెమీఫైనల్ కు చేరాయి. మొదటి సెమీ ఫైనల్లో రంగారెడ్డి జట్టు నిజామాబాద్ పై 5-1 తో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన జ్యోతి హ్యాట్రిక్ గోల్స్ సాధించడం విశేషం. రెండో సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు, నల్గొండపై 1-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ రేఖ గోల్ సాధించి తమ జట్టును ఫైనల్ చేర్చింది. ఆదివారం రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ జరగనుండగా నిజామాబాద్, నల్గొండ జట్లు మూడో స్థానం కోసం పోటీ పడతాయి. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి పింజ సురేంధర్, సాయ్నిస్ కోచ్ హర్షవర్ధన్ రెడ్డి, తెదేపా పట్టణ అధ్య క్షులు నర్సింహా రెడ్డి, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు శిఖారి శ్రీనివాస్, టెన్నికాయిట్ జిల్లా సంఘ అధ్య క్షులు మోతె రామాగౌడ్ తెరాస జిల్లా కార్యదర్శి అరల్ సురేష్ సంఘ బాధ్యులు ఆరిఫ్, జావిద్, అంజు, చిన్నయ్య నాగేష్, సంతోష్ రాజ్ కుమార్, రాజేందర్, శ్యామ్, ప్రేమ్, గంగారెడ్డి, సురేష్ నరేం దర్, సుధీర్ స్వామి, శ్రీనివాస్, రాహుల్ పరంజ్యోతి, విక్రమ్రెడ్డి, శేతెందర్, మాజిద్, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment