Saturday, 5 November 2016

సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

ప్రతీ విద్యార్థి సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవా లని, భవిష్యత్తు అంతా సైన్బుతోనే కొనసాగుతుందని జిల్లా సైన్స్ అధికారి నర్రా రామారావు అన్నారు. శనివారం మాకూర్ మండలంలోని మానిక్భండార్లో గల నవ్యభారతి పాఠశాలలో జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం ఉండా లని, అప్పుడే ఆయా అంశాల్లో ప్రతిభను కనబరిచే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సుస్థిరాభి వృద్ధి అనే ప్రధానాంశంగా సహజ వనరుల నిర్వహణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులు సైన్స్ కాంగ్రెస్లో పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్దేతలుగా నాగరా జుశర్మ వేణుగోపాల్, గంగాకిషన్, గగన్ కుమార్ ప్రేమ్చందర్, వెంగళాంబ, శ్రీపాద్లు వ్యవహరిం చారు. కార్యక్రమంలో సమన్వయకర్త భగత్ పాఠశాల కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment