Saturday, 5 November 2016

మూడు ముక్కలైన భుజం ఎముకకు శస్త్రచికిత్స

విజయవంతం చేసిన ప్రభుత్వ వైద్యుల బృందం

నవంబర్ 6, నిజామాబాద్ వార్త.కామ్:
అనుకుంటే సాధ్యం కానిదేమీ లేదంటారు పెద్దలు. నిన్నటి వరకు జిల్లా ఆస్పత్రిలో వైద్యం చేసేందుకే వెనుకడుగు వేసే వైద్యులు ఈరోజు ఏకంగా అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసి ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వైద్యులకు సరిపడా సౌకర్యాలు, వస్తువులు, ధియేటర్ తదితర వసతులను సమకూ ర్చడంతో శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. బాన్చువాడకు చెందిన గోపాల్(85) ప్రమాదంలో గాయపడి తలకు గాయమవడంతో పాటు భుజం విరిగి మూడు ముక్కలైంది. ఇదే సమయంలో చేతి రిస్ట్ జాయింట్ సైతం విరిగిపోయింది. మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన గోపాల్ కు తొలుత తలగాయానికి శస్త్రచికిత్స చేసి విజయంతంగా పూర్తి చేశారు. రోగి కోలుకోవడంతో శనివారం మూడు ముక్కలైన భుజం ఎముకను మార్చే అవసరం లేకుండా శస్త్రచికిత్స నిర్వహించారు. విరిగిన రిస్ట్ జాయింట్కు సైతం శస్త్రచికిత్స పూర్తి చేశారు. బోధనాస్పత్రి ఎముకల విభాగం హెచ్వోడి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో వైద్యుల బృందం ప్రసాద్, రూపాకుమారి, అభిమన్యూ బన్సిలాల్, సాహిత్ కలిసి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు.

No comments:

Post a Comment