Sunday, 6 November 2016

రేపటి నుంచి డిజిటల్ తరగతులపై శిక్షణ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్: 
జిల్లాలో డిజిటల్ తరగతులు నిర్వహించే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు శిక్షణనిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్ తెలిపారు. శిక్షణ ఆర్మూర్లోని క్షత్రియ ఇంజి నీరింగ్ కళాశాలలో ఉంటుందన్నారు. 7వ తేదీన గణితశాస్త్రం, 8వ తేదీన సామాన్యశాస్త్రం, 9వ తేదీన సాంఘికశాస్త్రం, 10వ తేదీన ఆంగ్లం, 11వ తేదీన తెలుగుపై శిక్షణ ఉంటుందన్నారు. డిజిటల్ తరగతులు ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావాలని సూచించారు.

No comments:

Post a Comment