Saturday, 5 November 2016

కమీషన్ వ్యవస్థను కట్టడి చేస్తాం

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:  
వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవ స్థను కట్టడి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పది నిమిషాల్లో ధర కట్టి అంతకంటే ఎక్కువ లాభాలు పొందే మధ్యదళారుల ప్రమేయాన్ని అరికడతామని వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అయన వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇక్కడ రైతులు నేరుగా పంట తీసుకొచ్చి వ్యాపారులకు అమ్మవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యార్డుల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడంలో కలెక్టర్ యోగితారాణా చొరవ అభినందనీయమని అయన ప్రశం సించారు. అంతకు ముందు యార్డులో పంట ఉత్పత్తులను పరిశీలించారు. ధరల పట్టిక హమాలీలు, కూలీల చెల్లింపులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

వారం రోజుల్లో మధ్యప్రదేశ్ కు వెళ్లాస్తా...

సోయా పంటను వచ్చే ఏడాది ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి సంబంధిత పడ్ప్రాసెస్ యూనిట్లకు పంపే ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మంత్రి పోచారం ప్రకటించారు. మధ్యప్రదేశ్లో సోయా పంటను అత్యధి కంగా సాగు చేస్తారని, వారం రోజుల్లో అక్కడకు వెళ్లి మార్కెటింగ్ విధానాలను పరిశీలిస్తానని వెల్లడిం చారు. వెంట కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పట్వారీ గంగాధర్ ఎమ్మెళ్ళీ వీజీ గౌడ్ జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి, మార్కెటింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment