Sunday, 6 November 2016

సేవా కార్యక్రమాలపైనే ప్రత్యేక దృష్టి

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు క్లబ్ గవర్నర్ అన్నె రత్న ప్రభాకర్ తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన సందర్భంగా హోటల్ కపిలాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 86 క్లబ్‌లలో మొత్తం 8400 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు ఇచ్చేందుకు 25 వేల బెంచీలు కొనుగోలు చేస్తున్నామని, 3200 బెంచీలు జిల్లాకు ఇవ్వనున్నట్ల తెలిపారు. రూ. 120 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ నెల 14న కసూర్చా పాఠశాలల్లో ఈ లెర్నింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావే శంలో క్లబ్ అధ్యక్షుడు జగదీశ్వర్ రావు, కార్యదర్శి విజయ్‌రావు, మాజీ అధ్యక్షుడు గౌతం, సభ్యులు శ్రీనివాస్ రావు, రంజిత్‌సింగ్ దర్శన్ సింగ్ మారయ్య గౌడ్ అశోక్ గుప్తా, అశోక్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment