Sunday, 6 November 2016

గాయపడిన చిన్నారికి నవయుగ ఇంజినీర్ల ఆర్థికసాయం

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
ప్రమాదంలో గాయపడి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నిజామా బాద్ జిల్లాకు చెందిన అలేఖ్య అనే చిన్నారి వైద్య ఖర్చుల కోసం నవయుగ కంపెనీ ఇంజినీర్లు స్పందించి శనివారం రూ. 40వేల ఆర్థిక సాయం అందించారు. నిజామాబాద్ జిల్లాలోని గోల్ హన్మాన్ ప్రాంతానికి చెందిన రవీందర్, శారదల కుమార్తె అలేఖ్య ప్రమాదవశాత్తు ఐదుడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆమె మెదడుకు గాయమై కోమాలోకి వెళ్లింది. తండ్రి రవీందర్ తనకున్న ఆస్థిని, బంగారు నగలను అమ్ముకొని వైద్యం చేయించినా పాప పూర్తిగా కోలుకోలేకపోయింది. నేటికీ పాపకు వైద్యం చేయిసూనే ఉన్నారు. ఉల్లిపాలెంలో పనిచేస్తున్న నవయుగ ఇంజినీర్లు నాణ్యతా నియంత్రణ ఇంజినీర్ పి.సీతారామరాజు ఆధ్వర్యంలో ఒకరోజు వేతనం రూ. 40వేలను పాప వైద్య ఖర్చుల కోసం అందించారు. చిన్నారి తండ్రి ఉల్లిపాలంలోని నవయుగ కంపెనీ నిర్మాణ ప్రాంతంలో ఈమొత్తాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో నవయుగ కంపెనీ ప్రాజెక్టు మేనేజరు ఖన్నన్, ఏపీ ఎంలు సత్యన్నారాయణ, అనిల్కుమార్, చిట్టిప్రోలు కేశవ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు

No comments:

Post a Comment