Saturday, 5 November 2016

కాన్సర్ నివారణపై అవగాహన ర్యాలీ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
క్యాన్స్టర్ నివారణపై అవగాహన కల్పించేందుకు ఐఎంఏ, తిరుమల ఆస్పత్రి ఆధ్వ ర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కనే ఉన్న తిరుమల ఆస్పత్రి వద్ద ప్రారంభించి ఖలీల్ వాడి మీదుగా రాజీవ్గాంధీ ఆడిటోరియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మద్య ధూమపానం, గుట్కాలు ఇలా అనేక నిషేధిత పదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్స్టర్లు చుట్టు ముడుతున్నాయని అన్నారు. క్యాన్స్టర్ను ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడితో ప్రాణాపాయం ఉండదని అన్నారు. క్యాన్స్టర్కు సైతం అనేక రకాల మందులు అందుబాటులోకి వచ్చాయని రోగులు బయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, కృష్ణమూర్తి డాక్టర్ వినోద్, రామ్దాస్, తిరు మల ఆస్పత్రి చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment