Saturday, 5 November 2016

మధ్యవర్తిత్వ చట్టాల కార్యశాల ప్రారంభం

నవంబర్ 6, నిజామాబాద్ వార్త.కామ్:

మధ్యవర్తిత్వ చట్టాలపై ఒక రోజు కార్యశాలను జిల్లా జడ్జి సుజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో మధ్యవర్తిత్వ చట్టాలపై ఏర్పాటు చేసిన కార్యశాలకు ముఖ్య అతిథిగా జిల్లా జడ్డి సుజన, అతిథులుగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు, కార్యదర్శి హరినాథ్, ప్రత్యేక శిక్షకులు సీతాదేవి, మంజీర వెంకటేశ్, ఇందిర కుమారి, సయ్యద్ ముసాఖాసీంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సుజన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ చట్టాలు కక్షిదారుల మధ్య గల మూల కారణాలను తెలుసుకుని మనస్ప ర్థలు తొలగించి భవిష్యత్లో విభేదాలు రాకుండా సమస్యలను పరిష్కరిస్తాయని చెప్పారు. కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ ఈ కార్యశాలను ప్రత్యేక శిక్షణ పొందిన శిక్షకులతో నిర్వహిస్తున్నామని, అందరు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ న్యాయ మూర్తి నూరీల్లఘవోరీ, కుటుంబ కోర్ట్ న్యాయమూర్తి ఉదయ్ కుమార్, జిల్లా జుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, పి.డి. మోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, న్యాయ విద్యారులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

గడప గడప ప్రచారంలో రాష్ట్రంలో మొదటిస్థానం

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా సంస్థ తమ కార్యక్రమాల గడప గడపకు ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం సంపాదించినట్లు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరినాథ్ తెలిపారు. జిల్లాలో 146000 మందికి తమ కార్యక్రమాలను ప్రచారం చేసి తొలిస్థానం సాధించామని అన్నారు. ఈ కార్యక్రమనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment