Saturday, 5 November 2016

విద్యార్ధులకు సులువుగా కుల ధ్రువీకరణ పత్రాలు

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

పాఠశాలలో చదివే విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ-సేవ కేంద్రాల చుటూ తిరగాల్సిన పని లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలను శనివారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం ఇక సులభమన్నారు. పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులను కలిస్తే పత్రాలు జారీ చేసేలా చూస్తారని తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పాలనాధికారిణి యోగితా రాణా, జేసీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్షిండె, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్ భూపతిరెడ్డి, డీఈఓ రాజేష్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment