Saturday, 5 November 2016

విద్యార్ధులను బెదరగొట్టే విధంగా పరీక్షపత్రాలు ఉండకూడదు

జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్

నవంబర్ 6, నిజామాబాద్ వార్త.కామ్:
ప్రశ్నా పత్రాలు చూస్తే విద్యార్థులు బెదిరిపోయేలా ఉండ కూడదని జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్ అన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే ముందస్తు ప్రశ్నా పత్రాలను జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు తయారు చేస్తున్నారు. వీటిని శనివారం విద్యాశాఖాధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష పత్రాలను వెనకబడిన విద్యార్థులను దష్టిలో పెట్టుకొని తయారు చేయాలన్నారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు రాబట్టే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాధికారి పద్మనాభం, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment