Saturday, 5 November 2016

ఘనంగా స్వాగత వేడుకలు

నవంబర్ 6, నిజామాబాద్ వార్త.కామ్:
అదరగొట్టే స్టెప్పులు. అలరించే పాటలు. ఆకట్టుకునే నాటి కలతో విద్యార్థులు హంగామా చేశారు. జూనియర్లకు సీనియర్లు స్వాగతం పలుకుతూ చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో కేర్ డిగ్రీ కళాశాల స్వాగత వేడుకలను నిర్వహించారు. విద్యార్థినుల ర్యాంప్వాక్తో మొదలైన కార్య క్రమం ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఆడిటోరియం ప్రాంగణం కేరింతలు, చప్పట్లతో మారుమోగి పోయింది. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి నరాల సుధాకర్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులంతా కలిసిమెలిసి ఉండాలని, ఉత్తమ మార్కులతో ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాలకు మంచి పేరుతేవాలన్నారు. కార్యక్రమంలో కళశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వంశీ, అధ్యా పక బృందం పాల్గొన్నారు.

No comments:

Post a Comment