Sunday, 6 November 2016

డిప్యటేషన్లు రద్దు చేయాలి

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
గత నెలలో ప్రభుత్వం డిప్యటేషన్ ను రద్దు చేసినా కొందరు కొనసాగుతున్నారని, వారి డిప్యటేషన్ ను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భానుచందర్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని ఆలూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించాల్సి ఉండగా, డిప్యటేషన్ పై ఓపెన్ స్కూల్ సొసైటీలో పని చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం డిప్యటేషన్ను రద్దు చేసి విద్యార్థులకు పారాలు బోధించేలా చర్యలు తీసుకోవాల న్నారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు విఠల్ పాటిల్ సందీప్, గంగాధర్ తదితరులు ఉన్నారు

No comments:

Post a Comment