Saturday, 5 November 2016

కాళేశ్వరం నీటితో జిల్లా సస్యశ్యామలం మంత్రి హరీశ్రావు

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్ :

కాళేశ్వరం నీటితో కామారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని, ప్రతి యేటా రెండు పంటలు పండుతాయని, రైతులు ఆనందంగా ఉంటారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో జరిగిన మార్కెట్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్ మార్కెట్ కమిటీల అధ్యక్షులుగా వెంకట్రాంరెడ్డి, గీత, శ్యాంరావు లతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం నీటిపై ఆమర్లబండ, కాటేవాడి, గుర్గాల్, మోతె వాగులపై రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. వాటికి డిసెంబరులో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, జనవరిలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.13 కోట్లతో 22,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంల నిర్మాణం చేపట్టా మన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న అధ్యక్షులు, పాలకవర్గ డైరెక్టర్ల రైతు లకు మద్దతు ధరను అందించేందుకు, రైతుల కష్టాలను తొలగించేందుకు కృషి చేయాలని మంత్రి హరీ శ్రావు పిలుపునిచ్చారు. సదాశివనగర్ మార్కెట్ కమిటీ కొత్త భవనానికి, గాంధారిలో రైతుల విశ్రాంతి భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రధమ స్థానం: ఎంపీ బీబీ పాటిల్
దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందని, కేసీఆర్ ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లాతో మరింత అభివృద్ధి చేసుకుందామని, లోక్సభ నియోజకవర్గ పరిధిలో నాలుగు జాతీయ రహదారులు మంజూరు చేయించామన్నారు. నియో జకవర్గానికి మంత్రి సహకారం మరువలేనిదన్నారు.

No comments:

Post a Comment