Sunday, 6 November 2016

సీపీ వస్తారని అప్రమత్తం

* నగరంలోని పోలీసుల హడావుడి * రెండో రాణాలో ప్రశ్నల వర్గం

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
నిజామాబాద్ నగరంలో శనివారం సాయంత్రం సీపీ కార్తికేయ ఆకస్మిక తనిఖీలు జరి పారు. దీంతో అన్ని రాణాల్లో అధికారులు అప్రమత్తయ్యారు. రెండో రాణాను సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించిన ఆయన ఆ వెంటనే ఐదో రాణాకు వెళ్లారు. దీంతో ఉన్నపళంగా అన్ని రాణాల అధికారులు మా రాణాకు ఎక్కడ వస్తారో అంటూ అప్ర మత్తమయ్యారు. ఇటు రోజువారీ వాహనాలు తనిఖీలు పెంచడంతో పాటు ట్రాఫిక్ రాణా అధికారులు అప్రమత్తం కావాల్సి వచ్చింది. సాధారణ తనిఖీల్లో భాగంగా నార్త్ జోన్ ఏసీపీ ఆనంద్ కుమార్తో కలిసి రెండో రాణాను తనిఖీ చేసిన సీపీ. తనదైన శైలిలో ఎస్పై బోసుకిరణ్ ను వివరాలు అడిగినట్లు సమాచారం. రాణా పరిధిలో ఎన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థనలు జరుగుతాయి. ? ఒక్కో ప్రార్థన మందిరానికి ఎంత మంది పెద్దలు ఉన్నారు. ? అంటూ ప్రశ్నలు కురిపిం చారు. సరైన సమాధానాలు రాకపోవటంతో పూర్తి అవగాహన పెంచుకోవాలంటూ సూచించినట్లు సమాచారం. అదే విధంగా రాణాలో నమోదైన కేసుల పరిష్కారంతో పాటు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. రాణాలోని అంగుళం అంగుళం తనిఖీ చేయటంతో పాటు పోలీసు వాహనాన్ని కూడా వదిలిపెట్టకపోవటంతో సిబ్బంది ఆశ్చర్యా నికి లోనయ్యారు. ఐదో రాణాలోను ఆకస్మికంగా తనిఖీ జరిపిన సీపీ ఎస్పై సైదయ్యతో వివరాలు అడిగి తెలుసుకున్నారు రాణా పరిధిలో ఎన్ని వార్డులున్నాయి? ఏయే సంబంధిత ఫిర్యాదులు వస్తుంటాయి? కేసుల నమోదు ఎలా ఉంది? అంటూ ప్రశ్నలు వేశారు. సిబ్బందితోను మాట్లాడి వివరాలపై ఆరా తీశారు. రాణాలో పనిచేసే సిబ్బంది సంబంధిత రాణా పరిధిలోని అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తనిఖీల్లో సీఐలు రవీందర్, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment