Saturday, 5 November 2016

నేటి నుంచి జ్ఞానయజ్ఞం

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
సుందర సత్సంగ్ వ్యవస్థాపకులు స్వామి సుందర చైతన్యానందుల వారిచే 231వ జ్ఞానయజ్ఞం ధార్మిక ప్రచనాలను ఆదివారం నుంచి 13వరకు రోజూ ఉదయం కైవల్యోపనిషత్తు, సాయంత్రం అమృతోపన్యాసాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సంస్థ ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని పాలిటె క్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా షామియానాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించారు. 6వ తేదీ సాయంత్రం 6.80లకు ప్రారంభ కార్యక్రమానికి స్వామివారితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

No comments:

Post a Comment