Friday, 4 November 2016

రెండు పడక గదుల ఇల్లు నిర్మించాలి: భాజపా


నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:
నగరంలో రెండు పడక గదుల ఇల్లు నిర్మించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. భాజపా నగర కమిటీ ఆద్వర్యంలో దరఖాస్తుదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ఎన్ని కల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, వాటికోసం నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2000 మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారన్నారు. గత సంవత్సరం దసరా రోజున ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టకపోవడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. లబ్దిదారులను మభ్యపెట్టించి ఇప్పుడు నిరాశకు గురి చేశారని విమర్శించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా కలెక్టర్ ఛాంబరుకు వచ్చి నినాదాలు చేశారు. డీఆర్వో పద్మాకర్ కు వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పట్టణ అధ్య క్షులు సుధాకర్, భరత్ భూషణ్, కర్పె గణేశ్ రాంచందర్, సంజయ్యాదవ్, భూమేశ్, కార్యకర్తలతోపాటు సుమారు 200 మంది దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment