Friday, 4 November 2016

డీసీసీ ప్రధాన కార్యదరి తిరుపతి రెడ్డి మృతి

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:


జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ప్రదాన కార్యదర్శి తిరుపతిరెడ్డి (52) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. తిరుపతిరెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో గురువారం హైదరాబాద్ బంజారహి ల్స్లోని ప్రైవేటు ఆస్పత్రికి వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. బీపీ ఎక్కువ కావడం, దానికి తోడు గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. తిరుపతిరెడ్డి గత పదేళ్ల పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీకి ఎనలేని సేవ చేశారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ హైదరాబాద్ ఆస్పత్రిలో తిరుపతిరెడ్డి పార్ధివ దేహన్ని సందర్శించి నివాళులు అర్పించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అధికార ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్, సుధాకర్రావు, పార్టీ నగర ఆధ్యక్షుడు కేశ వేణతో పాటు పలువురు తిరుపతిరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాల్కోండ మండలం పోచంపాడ్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి

No comments:

Post a Comment