Friday, 4 November 2016

కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ శిబిరం నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మినీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయింది. సంమం కార్యదర్శి అంద్యాల లింగయ్య హాజరై కబడ్డీ మైదానానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, సీనియర్ క్రీడాకారులు సుబ్బారావు, హాకీ శ్రీను, అజ్మత్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment